అళగిరి ర్యాలీ అట్టర్‌ ప్లాప్‌

5 Sep, 2018 13:25 IST

సాక్షి, చెన్నై : డీఎంకే బహిష్కృత నేత అళగిరి తలపెట్టిన శాంతి ర్యాలీ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. ర్యాలీకి ఎవరు హాజరుకావద్దంటూ డీఎంకే హెచ్చరించడంతో కార్యకర్తలు దూరంగా ఉన్నారు. దీంతో అళగిరి కేవలం తన సానుభూతిపరులతో మాత్రమే ర్యాలీని నిర్వహించారు. కాగా అళగిరి ర్యాలీకి కరుణానిధి అభిమానులు, డీఎంకే నేతలు భారీగా హాజరవుతారంటూ మొదట ప్రచారం జరిగినా.. పార్టీ అదేశాల మేరకు ఎవరు కూడా ర్యాలీలో పాల్గొనలేదు. దీంతో అన్నదమ్ముల అధిపత్య పోరులో అళగిరి చతికలపడ్డారు. డీఎంకే కార్యకర్తలను అదుపులో పెట్టడంలో స్టాలిన్‌ విజయం సాధించారు. ర్యాలీకి భారీగా తన అనుచరులు వస్తారని ఆశపడ్డ అళగిరి తీవ్రంగా నిరశపడ్డారు.

Tags