తిరుపతిలో దారుణం

5 Sep, 2018 13:18 IST

తిరుపతి: నగరంలో దారుణం చోటుచేసుకుంది. ఆర్ధిక ఇబ్బందులతో టీటీడీ కాంట్రాక్టు కార్మికుడు గంగాధర్‌ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబసభ్యులు హుటాహుటిన గంగాధర్‌ను దగ్గరలోని రుయా ఆసుపత్రికి తరలించగా..చికిత్సపొందుతూ కాసేపటికే మృతిచెందాడు. కుమారుడి మరణాన్ని తట్టుకోలేక రుయా ఆసుపత్రి ఆవరణలోని చెట్టుకు ఉరివేసుకుని గంగాధర్‌ తల్లి బలవన్మరణానికి పాల్పడింది. తల్లి, కుమారుడు మృతిచెందడంతో అక్కడ విషాద వాతావరణం నెలకొంది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags