చికాగోలో తెలుగు విద్యార్థి మృతి.. ‘ఆట’ సహాయం

5 Sep, 2018 22:30 IST

చికాగో : నగరంలో నాగరాజు అనే తెలుగు విద్యార్థి రైలు ప్రమాదంలో మృతిచెందాడు. నేపర్‌విల్లే వద్ద రైల్వే ట్రాక్‌ దాటుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కుమారుడి మరణవార్తతో అతని కుటుంబంలో విషాధ చాయలు అలుముకున్నాయి. కాగా మృతుడి కుటుంబానికి సహాయం చేయటానికి ‘‘అమెరికా తెలుగు అసోషియేషన్‌ (ఆట)సేవ బృందం’’ ముందుకొచ్చింది. ఆట తరుపున మహిపాల్‌  రెడ్డి గురువారం ఉదయం మృతుడి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఆట సేవ బృందం తరుపున వారికి సహాయం చేయనున్నారు.

ఆట సేవ బృందం ప్రతినిధి మాట్లాడుతూ.. తాను ఈ ఉదయమే మృతుడి కుటుంబాన్ని కలిశానన్నారు. అతడి కుటుంబం షాక్‌ గురై ఉందని వారికి సహాయం అవసరమని తెలిపారు. తాను నాగరాజు తమ్ముడితో మాట్లాడానన్నారు. అతని కుటుంబసభ్యులు పోస్ట్‌మార్టమ్‌ రిపోర్ట్‌ కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. నాగరాజు తల్లిదండ్రులు గురువారం ఉదయం భారతదేశం నుంచి చికాగోకు రాబోతున్నట్లు వెల్లడించారు. వారు ఇక్కడికి వచ్చిన తర్వాత అంత్యక్రియల విషయంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ పరిస్థితుల్లో ‘ఆట’ వారికి అండగా ఉంటుందని తెలిపారు. వారికి అవసరమైన పూర్తి సహకారాన్ని తమ చికాగో టీమ్‌ అందిస్తుందని పేర్కొన్నారు. అయితే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

Tags