రణస్థలంలో అశ్లీల వీడియో సంచలనం..

5 Sep, 2018 12:05 IST

శ్రీకాకుళం, రణస్థలం: జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు కళాశాలకు చెందిన యువతీ యువకులు ఉన్న అశ్లీల వీడియో రణస్థలంలో మూడు రోజులుగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ విషయమై జె.ఆర్‌.పురం పోలీస్‌స్టేషన్‌కు సమాచారం చేరడం, ఆ వీడియోలో ఉన్న యువకుడు రణస్థలం మండల కేంద్రానికి చెందినవాడు కావడంతో అతన్ని పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజులు విచారణ జరిపి వీడియోను ఎవరు బయటకు పంపించారో విచారణ జరిపి మరో ఇద్దరు యువకుల్ని సోమవారం కస్టడీలోకి తీసుకున్నారు.

ఈ ముగ్గురిపై విచారణ కొనసాగుతుండగా.. ఇంతలోనే యువకుల్ని వదిలేయాలని కొంతమంది నుంచి ఒత్తిళ్లు రావడంతో మంగళవారం వీరందరినీ విడిచిపెట్టేశారు. ఈ విషయమై జె.ఆర్‌.పురం ఎస్‌ఐ వి.సత్యనారాయణ విలేకరులతో మాట్లాడుతూ అశ్లీల వీడియోలో ఉన్న యువకుడిపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని చెప్పారు. అందుకే యువకుల్ని వదిలేస్తున్నామని, తదుపరి ఎవరైనా ఫిర్యాదు చేస్తే కస్టడీలోకి తీసుకుంటామని పేర్కొన్నారు.

Tags