చిక్కవరంలో పాముల కలకలం

5 Sep, 2018 10:41 IST
ప్రతీకాత్మక చిత్రం

గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిక్కవరంలో పాములు కలకలం రేపుతున్నాయి. ఇంట్లో నిద్రిస్తున్న ఇద్దరు యువకులను మంగళవారం రాత్రి పాము కాటేసింది. దీంతో కుటుంబసభ్యులు హుటాహుటిన యువకులను విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మూడు రోజుల క్రితం ఇదే గ్రామంలో పాము కాటుకు గురై ఓ వ్యక్తి మృతిచెందాడు. వారంలో ముగ్గురు పాము కాటు బారిన పడటంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు.

Tags