మరింత స్టయిలిష్‌గా ‘డాట్సన్‌ రెడిగో’

5 Sep, 2018 00:44 IST

న్యూఢిల్లీ: పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని.. డాట్సన్‌ ఇండియా ‘స్టయిలిష్‌ రెడి–గో లిమిటెడ్‌ వెర్షన్‌ 2018’ను విడుదల చేసింది. రెండు వేరియంట్లలో ఈ లిమిటెడ్‌ ఎడిషన్‌ అందుబాటులో ఉంటుంది. స్టయిలిష్‌ డిజైన్, పోల్చలేని పనితీరు, ఇంధన సామర్థ్యం, సౌకర్యం ఈ లిమిటెడ్‌ ఎడిషన్‌ ప్రత్యేకతలుగా కంపెనీ తెలియజేసింది.

సరికొత్త బాడీ గ్రాఫిక్స్, రియర్‌ పార్కింగ్‌ అసిస్ట్‌ సెన్సార్‌ సహా ఎన్నో ప్రత్యేక సదుపాయాలు ఇందులో ఉన్నట్టు పేర్కొంది. 0.8 లీటర్ల ఎంటీ వెర్షన్‌ ధర రూ.3.58 లక్షలు. 1.0 లీటర్‌ ఎంటీ వెర్షన్‌ ధర రూ.3.85 లక్షలు. వైట్, సిల్వర్, రెడ్‌ రంగుల్లో దేశవ్యాప్తంగా నిస్సాన్, డాట్సన్‌ డీలర్ల వద్ద అందుబాటులో ఉంటుంది.

Tags