దర్శకుడు శంకర్‌కు హైకోర్టు షాక్‌

4 Sep, 2018 10:36 IST
దర్శకుడు శంకర్‌

సినిమా: స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌కు చెన్నై హైకోర్టు షాక్‌ ఇచ్చింది. రూ.10 వేలు జరిమానా విధించింది. వివరాల్లోకెళితే రజనీకాంత్‌ హీరోగా శంకర్‌ 2010లో తెరకెక్కించిన చిత్రం ఎందిరన్‌.  సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అయితే ఎందిరన్‌ చిత్ర కథ తనదంటూ రచయిత ఆరూర్‌ తమిళ్‌నాడన్‌  చెన్నై హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. అందులో తన కథను అపహరించిన శంకర్‌ తనకు కోటి రూపాయలను నష్టపరిహారంగా చెల్లించేలా ఆదేశంచాల్సిందిగా కోరారు. ఈ పిటిషన్‌పై పలు మార్లు విచారణ జరిగింది. శంకర్‌ కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఆయన కోర్టుకు హాజరు కాకపోవడంతో న్యాయస్థానం ఆయనకు రూ.10 వేలు అపరాధం విధిస్తూ  సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Tags