వివాహిత అదృశ్యం

3 Sep, 2018 12:33 IST
దాసరి శివశ్రీ

ప్రకాశం, ఉలవపాడు: తన కుమార్తె రెండు రోజుల నుంచి కనబడటం లేదని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆదివారం రాత్రి కేసు నమోదు చేశారు. వివరాలు.. ఉలవపాడు అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన దాసరి శివశ్రీకి నాలుగేళ్ల క్రితం వివాహమైంది. భర్త స్వగ్రామం కూడా ఉలవపాడే కావడంతో అక్కడే కాపురం ఉంటున్నారు. శివశ్రీ శనివారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి ఎంతకూ రాలేదు. తల్లి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ వైవీ రమణయ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags