తాడిపత్రిలో రాక్షస పాలన

31 Aug, 2018 14:53 IST
వైఎస్సార్‌సీపీ నేత కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి(పాత చిత్రం)

అనంతపురం: తాడిపత్రిలో రాక్షసపాలన సాగుతోందని, జేసీ బ్రదర్స్‌ రాజకీయ హింసను ప్రోత్సహిస్తున్నారని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే , వైఎస్సార్‌సీపీ నేత కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి విమర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ.. జేసీ సోదరులకు పోలీసులు తొత్తులుగా మారిపోయారని ఆరోపించారు. జేసీ వర్గీయుల దౌర్జన్యంపై ప్రశ్నించిన తాడిపత్రి సమన్వయకర్త పెద్దారెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు చేయడం దుర్మార్గమన్నారు. పోస్టింగుల కోసం పోలీసు అధికారుల అరాచకాలను ప్రోత్సహించటం తగదన్నారు.

Tags