సంజయ్‌ బెయిల్‌పై విడుదల

31 Aug, 2018 09:13 IST
ధర్మపురి సంజయ్‌(పాత చిత్రం)

నిజామాబాద్‌: రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్‌ కుమారుడు, నిజామాబాద్‌ మాజీ మేయర్‌ సంజయ్‌ శుక్రవారం బెయిల్‌పై విడుదల అయ్యారు. నర్సింగ్‌ విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో సంజయ్‌పై ఈ నెల 12న పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెల్సిందే. అప్పటి నుంచి సంజయ్‌ 20 రోజుల పాటు సారంగపూర్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. నిన్న(గురువారం) ఎస్సీ ఎస్టీ కోర్టు సంజయ్‌కు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. ప్రతి గురువారం, శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో హాజరు కావాలని ఆదేశించింది.

Tags