అక్టోబర్‌ నుంచి విస్తార విదేశీ సర్వీసులు

30 Aug, 2018 01:33 IST

న్యూఢిల్లీ: విమానయాన సంస్థ విస్తార అక్టోబర్‌ నుంచి విదేశీ రూట్లలో విమాన సర్వీసులు ప్రారంభించనుంది. ముందుగా న్యూఢిల్లీ నుంచి కొలంబో (శ్రీలంక), ఫుకెట్‌ (థాయ్‌లాండ్‌) ప్రాంతాలకు సర్వీసులు ప్రారంభించే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందుకు అవసరమైన అనుమతులు పొందడం, అంతర్జాతీయ కార్యకలాపాల ప్రణాళికలు ఖరారుకి సంబంధించిన ప్రక్రియ మొదలుపెట్టినట్లు వివరించాయి.    

Tags