ద్యుతీకి మరో రజతం 

30 Aug, 2018 01:05 IST

భారత స్ప్రింటర్‌ ద్యుతీ చంద్‌ ఆసియా క్రీడల్లో రెండో పతకాన్ని సాధించింది. మహిళ 200 మీటర్ల పరుగులో ఆమె రెండో స్థానంలో నిలిచింది. ఈ రేసును ద్యుతీ 23.20 సెకన్లలో పూర్తి చేసింది. ఎడిడియాంగ్‌ ఒడియాంగ్‌ (బహ్రెయిన్‌– 22.96 సె.), వీ యోంగ్లీ (చైనా –23.27 సె.) స్వర్ణ, కాంస్యాలు గెలుచుకున్నారు. ఆదివారమే ద్యుతి 100 మీటర్ల స్ప్రింట్‌లో కూడా రజతం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఒకే ఏషియాడ్‌లో ఒకటి కంటే ఎక్కువ పతకాలు గెలిచిన నాలుగో అథ్లెట్‌గా చరిత్రకెక్కింది.

అంతకుముందు పీటీ ఉష 1986 సియోల్‌ ఏషియాడ్‌లో 200 మీ., 400 మీ. పరుగులు, 400 మీ. హర్డిల్స్, 4గీ400 మీటర్ల రిలేలో స్వర్ణాలు గెలిచింది. జ్మోతిర్మయి సిక్దర్‌ 1998లో 800 మీ., 1500 మీ. పరుగులో, సునీతా రాణి 2002లో 1500 మీ., 5 వేల మీ. పరుగులో పతకాలు గెల్చుకున్నారు.    

Tags