ఎక్కువ సీట్లొచ్చిన పార్టీకే ప్రధాని పీఠం: పవార్‌

28 Aug, 2018 01:55 IST

ముంబై: 2019 సార్వత్రిక ఎన్నికల్లో విపక్ష కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ స్పష్టం చేశారు. కూటమిలో ఎక్కువ సీట్లు గెలుచుకున్న పార్టీకే ప్రధాని పీఠం దక్కుతుందన్నారు. తనకు ప్రధానమంత్రి కావాలన్న కోరికలేదని రాహుల్‌ గాంధీ చెప్పడం సంతోషంగా ఉందని పవార్‌ పేర్కొన్నారు. ‘ఎన్నికలు జరగనీయండి. బీజేపీని అధికారం నుంచి దింపేసి.. మేం ఆ సీట్లో కూర్చుంటాం. ఎక్కువ సీట్లు పొందిన పార్టీ ప్రధాని పీఠానికి అర్హత సాధిస్తుంది. తను ప్రధాని రేసులో లేనని రాహుల్‌ గాంధీ చెప్పడం సంతోషకరం’ అని పవార్‌ వ్యాఖ్యానించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని   గద్దెదించడమే లక్ష్యంగా విపక్షాల కూటమి పనిచేస్తుందని చెప్పారు.

Tags