తల్లి కాబోతున్న బాలీవుడ్‌ నటి

24 Aug, 2018 20:40 IST
అంగద్‌ బేడి - నేహా దుపియాల పెళ్లి ఫోటో

బాలీవుడ్‌ నటి నేహా దుపియా ఎలాంటి హాడావుడి లేకుండా.. గుట్టుచప్పుడు కాకుండా  బిషన్‌ సింగ్‌ బేడీ కుమారుడు అంగద్‌ బేడిను వివాహామాడారు. నేహా చడీచప్పుడు కాకుండా పెళ్లి చేసుకోవడంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. వీరిద్దరూ హడావిడిగా పెళ్లి చేసుకోవడంపై అప్పట్లో ఎన్నో అనుమానాలు, సందేహాలు వ్యక్తమయ్యాయి. కొన్ని రోజుల తర్వాత నేహా ప్రెగ్నెంట్‌ అనే వదంతులు కూడా చక్కర్లు కొట్టాయి. అందుకే చడీచప్పుడు కాకుండా ఆమె వివాహం చేసుకున్నారని పుకార్లు వచ్చాయి. తాజాగా ఆ వదంతులన్నీ నిజం కాబోతున్నాయి. ఈసారి నేహా దుపియా నిజంగానే తల్లి కాబోతున్నారు. చాలా రోజుల నుంచి కొట్టిపారేస్తూ వస్తున్న ప్రెగ్నెన్సీ రూమర్లను, ఇప్పుడు ఆమె సోషల్‌ మీడియా వేదికగా కన్‌ఫామ్‌ చేసేశారు. 

ఇన్‌స్టాగ్రామ్‌లో నేహా కొన్ని ఫోటోలను షేర్‌ చేసింది. దానిలో తన భర్త అంగద్‌ను ప్రేమగా పట్టుకుని ఉండగా, తన బేబి బంప్‌ను చూపిస్తూ అంగద్‌ సంబురపడుతున్న పిక్చర్‌ను షేర్‌చేశారు. దానికి క్యాప్షన్‌గా... ‘కొత్త ఇన్నింగ్స్‌ ఇక్కడ ఉంది... #3ఆఫ్‌అజ్‌.....#సత్నంవహేగురు’  అంటూ పోస్టు చేశారు. అంగద్‌ కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇవే ఫోటోలను షేర్‌ చేస్తూ.. ‘హా! వదంతులు నిజం కాబోతున్నాయి... #3ఆఫ్‌అజ్‌.....  #సత్నంవహేగురు’ అంటూ పోస్టు చేశారు. ఇలా క్యూట్‌గా నేహా దుపియా తన ప్రెగ్నెన్సీని కన్‌ఫామ్‌ చేసేశారు. కాగ, నేహా, అంగద్‌ల వివాహం ఈ ఏడాది మేలో జరిగింది. వీరిద్దరూ ఈ విషయాన్నీ తమ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ధ్రువీకరించారు. తాజాగా తల్లిదండ్రులం కాబోతున్నామని విషయాన్ని కూడా సోషల్‌ మీడియా ద్వారానే కన్‌ఫామ్‌ చేశారు.  


 

సంబంధిత ఫోటోలు
Tags