వాజ్‌పేయి, మోదీ బంధానికి అద్దం పట్టే వీడియో

16 Aug, 2018 19:15 IST

భారత మాజీ ప్రధానమంత్రి, బీజేపీ కురువృద్ధుడు అటల్‌ బిహారీ వాజ్‌పేయి మరణంతో దేశం శోక సంద్రంలో మునిగిపోయింది. అటల్‌ జీని తన మెంటార్‌ భావించే ప్రధాని నరేంద్ర మోదీ వాజ్‌పేయి మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘నాకు మాటలు రావడం లేదు.  అటల్‌జీ మరణం వ్యక్తిగతంగా నాకు తీరని లోటు. ఆయన ప్రతి నిమిషం దేశం కోసం పనిచేశారు. ప్రియమైన నేత అటల్ బిహారీ వాజ్‌పేయి దివంగతులు కావడంతో భారతదేశం శోక సముద్రంలో మునిగిపోయిందంటూ’ మోదీ భావోద్వేగ పూరిత ట్వీట్‌ చేశారు. 

ఈ నేపథ్యంలో మోదీ, వాజ్‌పేయిల మధ్య అనుబంధానికి అద్దం పట్టే అరుదైన వీడియో ఒకటి ప్రముఖంగా నిలిచింది. బీజేపీ సామాన్య కార్యకర్తగా ఉన్న సమయంలో మోదీ అప్పటి భారత ప్రధాని వాజ్‌పేయిని కలుసుకున్నారు. బీజేపీ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశానికి హాజరైన అటల్‌ జీ దగ్గరికి వచ్చేందుకు మోదీ ప్రయత్నించిగా.. ఆయనను అక్కున చేర్చుకున్న వాజ్‌పేయి వెన్న తట్టి, ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. 

Tags