సమంత ట్వీట్‌.. స్పందించిన బన్నీ!

15 Aug, 2018 16:57 IST

సాక్షి, హైదరాబాద్ ‌: హార్డ్‌వర్క్‌లో నటుడు అల్లు అర్జున్‌ ‘హీరో’ అని స్టార్‌ హీరోయిన్‌ సమంత ప్రశంసించారు. ఇంతకీ విషయం ఏంటంటారా.. బన్నీ కథానాయకుడిగా నటించిన సినిమా ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’.. వక్కంతం వంశీ దర్శకత్వంలో వచ్చిన ఆ మూవీలో ‘లవర్‌ ఆల్సో, ఫైటర్‌ ఆల్సో’ పాటలో అల్లు అర్జున్‌ క్యాప్‌తో చేసిన డ్యాన్స్‌ స్టెప్స్‌ హైలైట్‌గా నిలిచాయి. క్యాప్‌ ట్రిక్‌ డ్యాన్స్‌ను తాను మూడు గంటలపాటు యత్నించినా చేయలేకపోయానని సమంత ట్వీట్‌ చేశారు. అందుకే అల్లు అర్జున్‌ హార్డ్‌వర్కర్‌ అని ఆమె కితాబిచ్చారు.

సమంత ట్వీట్‌పై బన్నీ స్పందిస్తూ రీట్వీట్‌ చేశారు. థ్యాంక్యూ స్యామ్‌. ట్రిక్స్‌ నేర్పించడంతో నాకు ఎలాంటి సమస్య లేదు. ఇతరులు నేర్పిస్తే నేర్చుకోవడం చాలా తేలిక అని తన ట్విట్‌లో పేర్కొన్నాడు అల్లు అర్జున్‌. బన్నీ రీట్వీట్‌పై సమంత స్పందిస్తూ.. ధన్యవాదాలు తెలియజేసే ఎమోజీలు పోస్ట్‌ చేశారు.

Tags