హీరోయిన్‌పై ట్రాన్స్‌జెండర్‌ మండిపాటు

8 Aug, 2018 10:01 IST
అలెగ్జాండ్రియా బిల్లింగ్స్‌, ఇన్‌సెట్లో స్కార్లెట్‌ జాన్సన్‌ (ఫైల్‌ ఫొటో)

న్యూయార్క్‌ : ట్రాన్స్‌జెండర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన హాలివుడ్‌ హీరోయిన్‌ స్కార్లెట్‌ జాన్సన్‌పై ట్రాన్స్‌జెండర్, నటి అలెగ్జాండ్రియా బిల్లింగ్స్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాన్స్‌జెండర్ల మనోభావాలు కించపరిచేలా మాట్లాడారని మండిపడ్డారు. నోటికొచ్చినట్టు మాట్లాడి క్షమాపణలు చెబితే సరిపోదని అన్నారు. ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటిపై తరచూ అసంబద్ధ వ్యాఖ్యలు చేసే ప్రముఖులు వారికి చేయూతనందించాలని మాత్రం చూడరని అన్నారు. 

అసలేం జరిగిందంటే.. ‘ట్రాన్స్‌పరెంట్’‌, ‘అవెంజర్స్‌ : ఇన్‌ఫినిటీ’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న బిల్లింగ్స్‌కు ట్రాన్స్‌జెండర్‌ ‘జీన్‌ మారీ గిల్‌’ కథతో రూపొందుతున్న ‘రబ్‌ అండ్‌ టగ్‌’ సినిమాలో లీడ్‌ రోల్‌లో నటించే అవకాశం వచ్చింది. అయితే కొందరు మారీ గిల్‌ పాత్రపై తీవ్ర విమర్శలు చేయడంతో బిల్లింగ్స్‌ ఈ సినిమా నుంచి జూలైలో తప్పుకుంది. కాగా, బిల్లింగ్స్‌ వదులుకున్న అవకాశాన్ని జాన్సన్‌ దక్కించుకున్నారు.

నటి జాన్సన్‌పై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. వీటిపై స్పందించిన జాన్సన్‌.. సినిమాల్లో నడిస్తున్న కొందరు ట్రాన్స్‌జెండర్లు అవార్డులు కూడా సొంతం చేసుకుంటున్నారు. ట్రాన్స్‌జెండర్‌ పాత్రలో నటిస్తే తప్పేంటని విమర్శలకు సమాధానిమిచ్చారు. ఈ వ్యాఖ్యలు బిల్లింగ్స్‌ను ఉద్దేశించి ఉండడంతో వివాదం మొదలైంది. 1980లలో మసాజ్‌ పార్లర్‌, వ్యభిచార వృత్తి చేసిన ట్రాన్స్‌జెండర్‌ జీన్‌ మారీ గిల్‌ బయటి ప్రపంచానికి పురుషునిగా మాత్రమే పరిచయముండడం విశేషం.

Tags