12, 13 తేదీల్లో ప్రొద్దుటూరులో డాక్టర్‌ ఖాదర్‌ సదస్సులు

7 Aug, 2018 17:23 IST

అటవీ వ్యవసాయ, సిరిధాన్యాల నిపుణులైన ప్రముఖ స్వతంత్ర ఆహార, ఆరోగ్య శాస్త్రవేత్త డా. ఖాదర్‌వలి ఈ నెల 12,13 తేదీల్లో వైఎస్సార్‌ కడప జిల్లాలో పర్యటించనున్నారు. 12(ఆదివారం)న సా.4.30 – రా.8 గం.ల వరకు వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరులోని వాసవీ కల్యాణ మంటపం(సరస్వతీ విద్యా మందిరం రోడ్డు, వైఎంఆర్‌ రోడ్డు)లో డా. ఖాదర్‌వలి అటవీ వ్యవసాయ పద్ధతుల్లో కరువు పరిస్థితుల్లో సిరిధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజల సాగుతోపాటు.. సిరిధాన్యాలను రోజువారీ ముఖ్య ఆహారంగా తీసుకుంటూ సంపూర్ణ ఆరోగ్యం పొందే పద్ధతులపై ప్రసంగిస్తారు. 13(సోమవారం)న ఉ. 9 గంటలకు మహిళల ఆరోగ్య సమస్యలను సిరిధాన్యాలతో పారదోలటంపై ప్రొద్దుటూరులోని ఎస్‌.కె.ఎస్‌.సి. డిగ్రీ కాలేజీలో డా. ఖాదర్‌ ప్రసంగిస్తారు. వివరాలకు.. డా. కాకర్ల బాలకృష్ణారెడ్డి (92469 48842), కామరాజు దండపాణి (98497 91967)లను సంప్రదించవచ్చు. 

Tags