రారండోయ్‌

6 Aug, 2018 01:49 IST
  • కవి శివారెడ్డిపై ప్రచురణ వాటిలో ఎంపిక చేసిన కవితల సంపుటి ‘అతడు మేము’ ఆవిష్కరణ ఆగస్ట్‌ 6న ఉదయం 10 గంటలకు నెల్లూరు టౌనుహాలు మిద్దెపైన జరగనుంది. ఆవిష్కర్త: దేవిప్రియ. కవి సమ్మేళనం ఉంటుంది.
  • భీంపల్లి శ్రీకాంత్‌ ‘మొగ్గలు’ ఆవిష్కరణ ఆగస్ట్‌ 9న సాయంత్రం 5 గంటలకు మహబూబ్‌ నగర్‌ జిల్లా కేంద్రంలోని లిటిల్‌ స్కాలర్స్‌ ఉన్నత పాఠశాలలో జరగనుంది. ఆవిష్కర్త: జలజం సత్యనారాయణ. నిర్వహణ: ధ్వని ప్రచురణలు, పాలమూరు సాహితి.
  • తెలంగాణ సాహిత్య అకాడమి నిర్వహిస్తున్న ‘కావ్య పరిమళం’ శీర్షిక క్రమంలో ఆగస్ట్‌ 10న సాయంత్రం 6 గంటలకు రవీంద్ర భారతిలోని సమావేశ మందిరంలో చరిగంట ధర్మన్న ‘చిత్రభారతం’పై డాక్టర్‌ సంగనభట్ల నరసయ్య ప్రసంగిస్తారు.
  • ‘తెలంగాణ సాహిత్య పరిశోధన– విశ్లేషణ’ ఒకరోజు సదస్సు ఆగస్ట్‌ 11న ఉదయం 10 నుండి సాయంత్రం 7 వరకు జిల్లా ప్రజా పరిషత్‌ సమావేశ మందిరం, కరీంనగర్‌లో జరగనుంది. నిర్వహణ: తుల గంగవ్వ మెమోరియల్‌ ట్రస్ట్, కరీంనగర్‌.
  • డాక్టర్‌ ఆవంత్స సోమసుందర్‌ సాహిత్య సమాలోచన ఆగస్ట్‌ 12న సాయంత్రం 5:30కు సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం, కడపలో జరగనుంది. నిర్వహణ: ఆంధ్రప్రదేశ్‌ అభ్యుదయ రచయితల సంఘం, కడప జిల్లా శాఖ.
  • ఉణుదుర్తి సుధాకర్‌ కథాసంపుటి ‘తూరుపు గాలులు’ ఆవిష్కరణ ఆగస్ట్‌ 12న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌ స్టడీ సర్కిల్‌లో జరగనుంది. నిర్వహణ: ఛాయ పబ్లికేషన్స్‌.
  • కామిశెట్టి జాతీయ పురస్కారం–2018కి 2015, 16, 17ల్లో ప్రచురించిన సాహిత్య వ్యాస సంపుటాలను ఆహ్వానిస్తున్నారు. పురస్కార నగదు, పదివేలు. మూడు ప్రతులను సెప్టెంబర్‌ 5లోగా ‘వీధుల విజయ రాంబాబు, 6–1–83, హెడ్‌ పోస్టాఫీస్‌ రోడ్, భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం–507111’ చిరునామాకు పంపాలి. ఫోన్‌: 9440255275. నిర్వహణ: కామిశెట్టి సాహిత్య వేదిక.
Tags