ఆమె బ్యాగ్‌ ఖరీదుతో ఓ కారు కొనచ్చు...

25 Jul, 2018 16:46 IST

ముంబై : ఒకప్పుడు భారత్‌లోనే అందరు నటీమణులకన్నా ఎక్కువ రెమ్యునరేషన్ అందుకునే నటి ఎవరైనా ఉన్నారా అంటే ఆమెనే కరిష్మా కపూర్‌. 1991 నుంచి 2004 వరకు సినీరంగంలో ఎంతో యాక్టివ్‌గా ఉన్న కరిష్మా, గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటోంది. ప్రతి జనరేషన్‌కు కరిష్మా కపూర్‌ స్టయిల్‌ ఐకాన్‌గానే నిలుస్తున్నారడంలో ఎలాంటి సందేహం లేదు. అప్పట్లోనే అందమైన కథానాయికగా పేరు తెచ్చుకున్న ఈమె, ఇప్పటికీ ఏ మాత్రం తన బ్యూటీని తగ్గించుకోలేదు. 1990 ఏళ్లకి, ఇప్పటికీ ఏ మాత్రం తేడా కనిపించకుండా.. ఆమె తన లుక్‌ను మెయిన్‌టైన్‌ చేస్తున్నారు. తాజాగా కరిష్మా ఓ స్టన్నింగ్‌ లుక్‌తో ముంబై ఎయిర్‌పోర్టులో దర్శనమిచ్చారు.

బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ డ్రస్‌, బ్లాక్‌ హ్యాండ్‌బ్యాగ్, బ్లాక్‌ గ్లాసస్‌‌.. రెడ్‌ లిప్స్‌, రెడ్‌ షూతో అదుర్స్‌ అనిపించేలా ఫోటోగ్రాఫర్ల కంటపడ్డారు. తన జుట్టును సైడ్‌కు దువ్వుకుని వదిలిపెట్టుకోవడం మరింత ఆకట్టుకుంటోంది. అయితే ఆమె చేతులో ఉన్న ఆ బ్యాగ్‌, వేసుకున్న టీ-షర్ట్‌ ఖరీదు వింటే మీరు ఆశ్చర్యపోవాల్సిందేనట. సాదాసీదాగా కనిపించేలా ఆమె వేసుకున్న ఆ బ్లాక్‌ టీ-షర్ట్‌ పర్సియన్‌ బ్రాండ్‌ శాండ్రోకు చెందిందట. దాని ధర 6,184 రూపాయలని తెలిసింది. ఇక కరిష్మా చేతిలో టోట్‌ బ్యాగ్‌, ఫ్రెంచ్‌ హై-ఫ్యాషన్‌ లగ్జరీ గూడ్స్‌ తయారీదారి హీర్మేస్‌కు చెందిందట. దీని ధర 8,650 డాలర్లు అంటే సుమారు ఆరు లక్షల రూపాయలని తెలిసింది. అంటే ఈమె బ్యాగ్‌ ఖరీదుతో ఓ కారునే కొనుక్కోవచ్చట. ఇంత కాస్ట్‌లీ లుక్‌తో ఆమె ఇటీవల ముంబై ఎయిర్‌పోర్టులో దర్శనమిచ్చారు. కాగ, ఇటీవల కరిష్మా, రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. అయితే ఆ వార్తలను కరిష్మా తండ్రి రణ్‌ధీర్‌ కొట్టిపారేశారు. పిల్లలే తన ప్రపంచమని ఆయన చెప్పారు. 

Tags