అమీ ఆగయా

22 Jul, 2018 03:55 IST
అమీ జాక్సన్‌

‘ది విలన్‌’ సినిమా కోసం బెంగళూరులో ల్యాండ్‌ అయ్యారు హీరోయిన్‌ అమీ జాక్సన్‌. ప్రేమ్‌ దర్శకత్వంలో శివరాజ్‌కుమార్, సుదీప్, అమీ జాక్సన్‌ ముఖ్య తారలుగా రూపొందుతోన్న కన్నడ సినిమా ‘ది విలన్‌’. శ్రీకాంత్, మిథున్‌ చక్రవర్తి కీలక పాత్రల్లో కనిపిస్తారు. శ్రీకాంత్‌ది విలన్‌ రోల్‌ అని సమాచారం. మిథున్‌ చక్రవర్తికి కన్నడంలో ఇది తొలి చిత్రం. ఇటీవలే ఇద్దరు హీరోలు శివరాజ్‌ కుమార్, సుదీప్‌లకు వేరు వేరుగా టీజర్స్‌ను కట్‌ చేశారు. ప్రస్తుతం బెంగళూరులో జరుగుతోన్న ఈ సినిమా ఫైనల్‌ షెడ్యూల్‌లో జాయిన్‌ అయ్యారు అమీ జాక్సన్‌. సాంగ్‌ షూట్‌ జరుగుతోంది. ఈ సినిమాను ఆగస్టు చివరి వారంలో రిలీజ్‌ చేయాలనుకుంటున్నారట.

Tags