నాడు దెయ్యాల కొంప.. మరి నేడు..?

26 Mar, 2018 20:36 IST

ఒకప్పుడు అక్కడ ప్రజలు అడుగు పెట్టాలంటే వణుకు. అక్కడ దెయ్యాలు ఉండేవని స్థానికులు భ్రమపడేవారు. కానీ వందేళ్ల తర్వాత అక్కడ పరిస్థితి మారిపోయింది. దానికి కారణం అక్కడి వాతావరణాన్ని పూర్తిగా ఫేమస్ టూరిస్ట్ స్పాట్‌గా మార్చేయడమే. ఈ బిజీ బిజీ లైఫ్‌లో ఉన్న ఒత్తిడిని తగ్గించుకోవడానికి అదొక మంచి ప్రదేశంగా మారడమే. ఇలా మార్చడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని నిర్వాహకులు క్రిష్టినా రోసి తెలిపారు. 

1880 కాలంలో ఇక్కడ ప్రజలు నివసించేవారు. వారంతా బంగారం, వెండి తవ్వుకుంటూ జీవనం సాగించేవారు. కానీ 1919 వచ్చేసరికి ఏమైందో ఏమో కానీ జనసంచారం తగ్గి ఎడారిలా మారింది. కారణం అక్కడ  ఓ భవనంలో దెయ్యాలున్నాయని ప్రచారం జరగడం. దీంతో ఓ శతాబ్దకాలం మూగబోయినట్లున్న ఆ ఏరియా ఇప్పుడు పర్యాటకులతో నిండిపోయింది. మొత్తం 1600 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ రిసార్ట్‌లో 200 ఎకరాల్లో దాదాపు 12 లాగ్‌ క్యాబిన్లను నిర్మించారు. వాటికి పూర్వీకుల పేర్లు, ఆ ప్రాంత చరిత్రను సూచించేలా పేర్లు పెట్టారు. 

ఒక్కోటి అధునాతన హంగులతో తీర్చిదిద్దారు. ఇంకా అక్కడికి తరలివస్తున్న పర్యాటకులకు ఫిషింగ్‌, హార్స్‌ రైడింగ్ చేసుకునే అవకాశం కల్పించారు. కాకపోతే ఇవి కొంచెం ఖర్చుతో కూడుకున్నవి. ఇక్కడ ఒక్కరికి ఒక్క రాత్రికి 630- 2100 డాలర్లు అవుతుంది. ఇంతకీ ఈ ప్రదేశం ఎక్కడో చెప్పలేదు కదూ... కొలరెడోలోని డంటన్‌ హిల్‌స్టేషన్‌ ప్రాంతం.

సంబంధిత ఫోటోలు
Tags