కోడి గుడ్డు కాదు..మనిషి పెట్టిన గుడ్డు!

22 Feb, 2018 16:41 IST

అదేంటి మనిషి ఎక్కడైనా గుడ్డు పెడతాడా? జంతువులు, పక్షులు కదా గుడ్డు పెట్టేవి అని అనుకుంటున్నారా? కానీ ఇండోనేషియాకు చెందిన 14 ఏళ్ల బాలుడు గుడ్లు పెడుతున్నాడు. అదేంటని విచిత్రంగా అనుకుంటున్నారా? దాని సంగతేంటో ఓసారి చూద్దాం.

ఇండోనేషియాకు చెందిన అక్మల్‌ గత రెండేళ్ల నుంచి గుడ్లు పెడుతున్నాడనీ, ఇప్పటి వరకు 20 గుడ్లు పెట్టాడనీ అతని తండ్రి తెలిపాడు.  ఈ విచిత్ర వ్యవహారంపై వైద్యులను సంప్రదించినా ఫలితం  లేకపోయింది. డాక్టర్ల ఎదుటే అక్మల్‌ రెండు గుడ్లు పెట్టాడు. దీంతో గుడ్లు తేలేయడం వైద్యుల వంతైంది. అక్మల్‌కు అన్ని పరీక్షలు నిర్వహించినా, అసలు విషయాన్ని మాత్రం కనిపెట్టలేక చేతులెత్తేశారు.

అంతేకాకుండా మనిషి గుడ్లు పెట్టడం అసాధ్యమని, అక్మల్‌ గుడ్లు మింగేసి ఉంటాడని అవే బయటకు వస్తుండవచ్చని చెబుతున్నారు. అయితే అక్మర్‌ తండ్రి మాత్రం.. తన కొడుకు ఇంతవరకు గుడ్డు మింగలేదని తెలిపారు. పైగా అతడు పెట్టే గుడ్డు పూర్తిగా ఎల్లో లేదా వైట్‌గా ఉంటుందని పేర్కొన్నారు. 

Tags