ఆమెకు 38 .. అతనికి 23.. ఒకటి చేసిన కట్నం

26 Jan, 2018 16:57 IST

బీజింగ్‌ : డబ్బుల ఆశగా చూపి తమ కన్నా మయస్సులో చిన్నవారిని వివాహాలు చేసుకునే మగాళ్లను చూశాం.. కానీ చైనాలో వింతగా ఓ మహిళ తన కన్నా వయస్సులో 15 ఏళ్లు చిన్న వాడైన ఓ యువకుడిని పెళ్లాడి వార్తల్లో నిలిచింది.  తైవాన్‌ వార్త కథనం ప్రకారం 38 ఏళ్ల మహిళా ఒక కోటి రూపాయలను(5 మిలియన్ల యువాన్లు ) కట్నంగా ఇచ్చి 23 ఏళ్ల యువకుడిని పెళ్లాడింది. వీరి పెళ్లి జనవరి10న హైనాన్ ప్రావిన్స్‌లోని కియోంగై సిటీలో ఘనంగా జరిగింది.

తొలుత ఈ పెళ్లికి యువకుని తల్లితండ్రులు  వ్యతిరికేంచింగా సదరు మహిళ కోటి రూపాయల కట్నం ఇవ్వడంతో వెంటనే అంగీకరించారు. ఈ పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఈ వీడియోలో మహిళ ఆభరణాలు, రెండు రెడ్‌ స్పోర్ట్స్‌ కారులతో అత్యంత ధనికురాలిగా కనిపించింది. ఇక్కడ విశేషం ఏంటంటే ఆ సదరు మహిళకు అప్పటికే 14 ఏళ్ల కుమారుడున్నాడు. అంతేకాకుండా పెళ్లికొడుకు తల్లితండ్రుల వయస్సు కూడా ఈ మహిళ కంటే రెండు, మూడు ఏళ్లే ఎక్కువ.

Tags