ప్రపంచంలోనే బుల్లి ఉడత

25 Sep, 2017 18:20 IST

జకార్తా: ఇండోనేసియాలోని బోర్నియో అడవుల్లో ప్రపంచంలోనే అంతరించి పోయే జాతుల జాబితాలో ఉన్న అతి చిన్నదైన ఉడతను పరిశోధకులు కనుగొన్నారు. 73 మిల్లీమీటర్ల పొడవు, 17 గ్రాముల బరువైన ఈ బుల్లి ఉడతను సెప్టెంబర్‌ 16 వ తేదీన కనుగొన్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు.

దక్షిణ కాలిమంతన్‌ ప్రావిన్స్‌లోని మెరటస్‌ కొండలపై కనిపించిన ఈ ఉడతను శాస్త్రీయ పరిభాషలో బోర్నియన్‌ పిగ్మీ లేదా ఎక్సిలిసియురస్‌ ఎక్సిలిస్‌ అని పిలుస్తారు. సముద్ర మట్టానికి వెయ్యి మీటర్ల ఎత్తులో ఇవి సంచరిస్తుంటాయని శాస్త్రవేత్తలు వివరించారు.

Tags