గ్రహం అనుగ్రహం

17 Sep, 2017 01:33 IST
గ్రహం అనుగ్రహం

గ్రహం అనుగ్రహం
శ్రీ విళంబి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్షఋతువు, భాద్రపద మాసం, తిథి శు.దశమి రా.10.40 వరకు, తదుపరి ఏకాదశి, నక్షత్రం పూర్వాషాఢ ప.12.03 వరకు, తదుపరి ఉత్తరాషాఢ, వర్జ్యం రా.8.54 నుంచి 10.40 వరకు, దుర్ముహూర్తం ప.11.30 నుంచి 12.20 వరకు, అమృతఘడియలు... ఉ.6.48 నుంచి 7.56 వరకు.

సూర్యోదయం            :  5.52
సూర్యాస్తమయం       :  5.58
రాహుకాలం             :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం            :  ఉ.7.30 నుంచి 9.00 వరకు 

భవిష్యం
మేషం: పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. దైవదర్శనాలు. ఆరోగ్యం కాస్త మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

వృషభం: పనులు ముందుకు సాగవు. ప్రయాణాలలో ఆటంకాలు. సోదరులు,సోదరీలతో కలహాలు. ఆరోగ్యసమస్యలు. భూవివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగించవచ్చు.

మిథునం: పనుల్లో ముందడుగు వేస్తారు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రయాణాల్లో కొత్త పరిచయాలు. సభలు,సమావేశాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.

కర్కాటకం: శ్రమ ఫలిస్తుంది. నూతన విద్యావకాశాలు. ప్రముఖ వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆకస్మిక ధన, వస్తులాభాలు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి  బయటపడతారు.

సింహం: కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. శ్రమాధిక్యం. బంధువులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

కన్య: మిత్రులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము అందక ఇబ్బంది. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తప్పవు.

తుల: దూరపు బంధువులను కలుసుకుంటారు. స్థిరాస్తి ఒప్పందాలు. ఆలోచనలు అమలు చేస్తారు. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. వ్యాపార, ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.

వృశ్చికం: కుటుంబసభ్యులతో వైరం. ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో ప్రతిబంధకాలు. అనారోగ్యం, ఔషధసేవనం. నిరుద్యోగులకు నిరాశ. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

ధనుస్సు: శుభకార్యాలకు హాజరవుతారు. ఆస్తి వివాదాల పరిష్కారం. విందువినోదాలు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూలత.

మకరం: వ్యవహారాలు మందగిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా. మిత్రులు, శ్రేయోభిలాషులతో విభేదాలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిళ్లు.

కుంభం: సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. ముఖ్యమైన పనులు విజయవంతంగా సాగుతాయి. ఆకస్మిక ధనలాభాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మరింత అనుకూలం.

మీనం: ఆర్థిక ఇబ్బందులు తీరతాయి. ఆప్తుల నుంచి పిలుపు అందుతుంది. వాహనయోగం. ఇంటర్వ్యూలు అందుకుంటారు. వ్యాపారాలలో ప్రగతి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉండవచ్చు.
– సింహంభట్ల సుబ్బారావు 

Tags