Breaking News

Ashes Series: ఆఖరి టెస్టు.. ఖవాజా మరోసారి... ఇంగ్లండ్‌ ఏకంగా 5 మార్పులతో..

Published on Fri, 01/14/2022 - 09:56

Ashes Series 2021-2022 Aus Vs Eng Final Test: యాషెస్‌ సిరీస్‌ 2021-22లో భాగంగా ఆఖరి టెస్టుకు ఆస్ట్రేలియా- ఇంగ్లండ్‌ సిద్ధమయ్యాయి. ఇప్పటికే మూడు విజయాలతో ట్రోఫీ సొంతం చేసుకున్న కంగారూలు... సిరీస్‌ను గెలుపుతోనే ముగించాలని భావిస్తున్నారు. మరోవైపు.. నాలుగో టెస్టులో అద్భుత పోరాటంతో డ్రా చేసుకున్న ఇంగ్లండ్‌.. ఐదో టెస్టులో నెగ్గి పరువు నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ క్రమంలో హోబర్ట్‌ వేదికగా జరిగే టెస్టు మ్యాచ్‌ మరింత ఉత్కంఠగా మారింది. 

టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. ఇక సిడ్నీ టెస్టుతో రెండేళ్ల తర్వాత పునరాగమనం చేసి వరుస సెంచరీలు సాధించిన ఆసీస్‌ బ్యాటర్‌ ఉస్మాన్‌ ఖావాజా ఐదో టెస్టు తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. మార్కస్‌ హారిస్‌ స్థానంలో జట్టులోకి వచ్చాడు. ఇక కరోనా బారిన పడి కోలుకున్న ట్రవిస్‌ హెడ్‌ రాకతో ఆసీస్‌ బలం మరింత పెరిగినట్లయింది.

మరోవైపు ఇంగ్లండ్‌ ఏకంగా ఐదు మార్పులతో బరిలోకి దిగింది. హమీద్‌ స్థానంలో బర్న్స్', బెయిర్‌స్టో స్థానంలో పోప్‌, బట్లర్‌కు బదులు బిల్లింగ్స్‌, ఆండర్సన్‌ ప్లేస్‌లో వోక్స్‌, లీచ్‌ స్థానంలో రాబిన్సన్‌ జట్టులోకి వచ్చారు. హమీద్‌ను జట్టు నుంచి తప్పించగా.. బట్లర్‌, బెయిర్‌ స్టో గాయాల కారణంగా దూరమయ్యారు. 

యాషెస్‌ సిరీస్‌ ఐదో టెస్టుకు ఆసీస్‌- ఇంగ్లండ్‌ తుది జట్లు:
ఆస్ట్రేలియా:
డేవిడ్‌ వార్నర్‌, ఉస్మాన్‌ ఖవాజా, మార్నస్‌ లబుషేన్‌, స్టీవెన్‌ స్మిత్‌, ట్రవిస్‌ హెడ్‌, కామెరూన్‌ గ్రీన్‌, అలెక్స్‌ క్యారీ, పాట్‌ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌, నాథన్‌ లియాన్‌, స్కాట్‌ బోలాండ్‌.

ఇంగ్లండ్‌:
రోరీ బర్న్స్‌, జాక్‌ క్రాలే, డేవిడ్‌ మలన్‌, జో రూట్‌, బెన్‌స్టోక్స్‌, ఓలీ పోప్‌, సామ్‌ బిల్లింగ్స్‌, క్రిస్‌ వోక్స్‌, మార్క్‌ వుడ్‌, ఒలీ రాబిన్సన్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌. 

చదవండి: Virat Kohli: ఓడిపోతున్నామనే బాధ.. కోహ్లి అసహనం

Videos

కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వట్లేదు.. డీజీపీపై అంబటి ఫైర్

అణ్వాయుధాలకు బెదిరే ప్రసక్తేలే..!

విచారణ పేరుతో గోవిందప్ప కుటుంబంపై సిట్ వేధింపులు

అబద్ధపు వాంగ్మూలాలతో లేని మద్యం కేసు.. బాబు కుట్ర రాజకీయాలు

మద్యం కేసులో ఏపీ ప్రభుత్వ యంత్రాంగం తీరుపై సుప్రీంకోర్టు విస్మయం

రిమాండ్ రిపోర్ట్ లో చంద్రబాబు భేతాళ కథలు

మురళి నాయక్ కుటుంబానికి వైఎస్ జగన్ భరోసా

ఆపరేషన్ సిందూర్ లో ఎయిర్ ఫోర్స్ కీలక పాత్రపై ప్రధాని హర్షం

PM Modi: వచ్చేది వినాశనమే పాక్ కు నిద్ర పట్టనివ్వను

YSRCP మహిళా విభాగం రాష్ట్రస్థాయి సమావేశం

Photos

+5

అంగరంగ వైభవంగా తిరుపతి గంగమ్మ జాతర..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

దారి వెంట నీరాజనం..‘జై జగన్‌’ అంటూ నినాదాలు (ఫొటోలు)

+5

#MissWorld2025: బ్యూటీ విత్‌ ఫన్‌..‘బుట్ట బొమ్మా’ పాటకు స్టెప్పులు (ఫొటోలు)

+5

చౌమహల్లా ప్యాలెస్‌లో యువరాణుల్లా మెరిసిన సుందరీమణులు (ఫొటోలు)

+5

చార్మినార్ దగ్గర మిస్‌ వరల్డ్‌ అందాలభామల ఫోటోషూట్ (ఫొటోలు)

+5

భావితరాలు మీరు ఆదర్శం: భారత సైన్యానికి మోదీ సెల్యూట్ (ఫొటోలు)

+5

హీరో గోపీచంద్ వెడ్డింగ్ యానివర్సరీ (ఫొటోలు)

+5

నిర్మాత ఇషారీ గణేశ్ కూతురి రిసెప్షన్.. హాజరైన స్టార్స్ (ఫొటోలు)

+5

ఏపీలో ప్రసిద్ధ వాడపల్లి.. 7 శనివారాల వెంకన్న ఆలయం.. మీరు ఎప్పుడైనా వెళ్ళారా (ఫొటోలు)

+5

ఖరీదైన ఇల్లు కొన్న 'అనసూయ'.. గృహ ప్రవేశం ఫోటోలు చూశారా?