Breaking News

ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ1 ప్రయోగం విఫలం.. నిరుపయోగంగా శాటిలైట్స్‌

Published on Sun, 08/07/2022 - 16:38

సూళ్లూరుపేట(తిరుపతి): ఎంతో ప్రతిష్టాత్మంగా చేపట్టిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ1 ప్రయోగం విఫలమైందని అధికారికంగా ప్రకటించింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. ఆ రాకెట్‌ మోసుకెళ్లిన రెండు ఉపగ్రహాలు ఇకపై పనికిరావని ఈ మేరకు ట్విట్టర్‌ ద్వారా తెలిపింది. మూడు దశలను విజయవంతంగా దాటిన రాకెట్‌.. టర్మినల్‌ దశలో అదుపు తప్పింది. రెండు ఉపగ్రహాలను 356x76 కిలోమీటర్ల దీర్ఘ వృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టాల్సి ఉంది. అయితే.. ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ1 రాకెట్‌ వాటిని 356 కిలోమీటర్లు వృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టింది.

అందువల్ల ఈ ఉపగ్రహాలు పనికి రావని ఇస్రో వెల్లడించింది. సెన్సార్‌ విఫలమవటం వల్లే ఈ సమస్య తలెత్తిందని పేర్కొంది. టర్మినల్‌ దశలో తలెత్తిన సాంకేతిక సమస్యపై ఇస్రో ఏర్పాటు చేసిన కమిటీ విశ్లేషిస్తోందని, ఈ కమటీ ఇచ్చే నివేదిక, ప్రతిపాదనల ఆధారంగా త్వరలోనే ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ2 ప్రయోగాన్ని చేపడతామని పేర్కొంది. 

ఇస్రో కొత్తగా అభివృద్ధి చేసిన చిన్న ఉపగ్రహా వాహకనౌక ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ1ను తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌లోని మొదటి ప్రయోగవేదిక నుంచి ఆదివారం ఉదయం 9.18 గంటలకు ప్రయోగించారు. ఈ రాకెట్‌ ఈవోఎస్‌-02, ఆజాదీశాట్‌ ఉపగ్రహాలను మోసుకెళ్లింది. ఈవోఎస్‌-02 ఉపగ్రహం బరువు 140 కిలోలు. ఇది భూమిని పరిశీలిస్తుంది. ఆజాదీశాట్‌ బరువు 8 కిలోలు. 75 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 750 మంది విద్యార్థులు దీన్ని రూపొందించారు.  ఈ ప్రయోగంలో మూడు దశలు అనుకున్నట్లుగానే పూర్తయినట్లు ఇస్రో మొదట వెల్లడించింది. టెర్మినల్‌ దశకు సంబంధించిన సమాచారం రావడంలో కొంత జాప్యం జరిగినట్లు తెలిపింది.

Videos

విడదల రజిని ఘటనపై ఎంపీ తనుజా రాణి ఫైర్

వైఎస్ఆర్ సీపీకి చెందిన ప్రజా ప్రతినిధి కల్పనపై అక్రమ కేసు

కోట శ్రీనివాస్ కోడి లెక్కన్నే ఉన్నయ్.. సూపర్ సిక్స్ పథకాలు

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్‌

వరంగల్ పర్యటనకు ప్రపంచ సుందరీమణులు..

కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వట్లేదు.. డీజీపీపై అంబటి ఫైర్

అణ్వాయుధాలకు బెదిరే ప్రసక్తేలే..!

విచారణ పేరుతో గోవిందప్ప కుటుంబంపై సిట్ వేధింపులు

అబద్ధపు వాంగ్మూలాలతో లేని మద్యం కేసు.. బాబు కుట్ర రాజకీయాలు

మద్యం కేసులో ఏపీ ప్రభుత్వ యంత్రాంగం తీరుపై సుప్రీంకోర్టు విస్మయం

Photos

+5

అంగరంగ వైభవంగా తిరుపతి గంగమ్మ జాతర..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

దారి వెంట నీరాజనం..‘జై జగన్‌’ అంటూ నినాదాలు (ఫొటోలు)

+5

#MissWorld2025: బ్యూటీ విత్‌ ఫన్‌..‘బుట్ట బొమ్మా’ పాటకు స్టెప్పులు (ఫొటోలు)

+5

చౌమహల్లా ప్యాలెస్‌లో యువరాణుల్లా మెరిసిన సుందరీమణులు (ఫొటోలు)

+5

చార్మినార్ దగ్గర మిస్‌ వరల్డ్‌ అందాలభామల ఫోటోషూట్ (ఫొటోలు)

+5

భావితరాలు మీరు ఆదర్శం: భారత సైన్యానికి మోదీ సెల్యూట్ (ఫొటోలు)

+5

హీరో గోపీచంద్ వెడ్డింగ్ యానివర్సరీ (ఫొటోలు)

+5

నిర్మాత ఇషారీ గణేశ్ కూతురి రిసెప్షన్.. హాజరైన స్టార్స్ (ఫొటోలు)

+5

ఏపీలో ప్రసిద్ధ వాడపల్లి.. 7 శనివారాల వెంకన్న ఆలయం.. మీరు ఎప్పుడైనా వెళ్ళారా (ఫొటోలు)

+5

ఖరీదైన ఇల్లు కొన్న 'అనసూయ'.. గృహ ప్రవేశం ఫోటోలు చూశారా?