More

కేంద్రంపై బాలీవుడ్‌ నటి మీరా చోప్రా విమర్శలు

18 May, 2021 19:27 IST

బీజేపీ ప్రభుత్వంపై బాలీవుడ్‌ నటి తీవ్ర విమర్శలు

కంటికి కనిపించని కరోనా వైరస్‌ ఎంతో మందిని పొట్టన పెట్టుకుంటుంది. డబ్బులు ఉన్నా సరైన వైద్యం అందక ఎంతోమంది తమ ఆప్తులను పోగొట్టుకుంటున్నారు. కరోనా కట్టడిలో కేంద్రం ఘోరంగా విఫలమయ్యిందని అటు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్‌ నటి, ప్రియాంక చోప్రా సోదరి మీరా చోప్రా కేంద్రం వైఖరిపై విమర్శలు గుప్పించారు. కోవిడ్‌ రోగులకు సకాలంలో బెడ్లు, ఆక్సిజన్‌ సిలిండర్లు దొరక్క ప్రాణాలు కోల్పోతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రానికి 18 శాతం జీఎస్టీని ఎందుకు చెల్లించాలంటూ ప్రశ్నించారు. ప్రజలకు కనీస సౌకర్యాలను కూడా కల్పించనప్పుడు ఈ జీఎస్టీని తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేస్తూ పీఎంవో ఇండియా, అమిత్‌ షా సహా కొందరు కేంద్ర మంత్రలకు ట్యాగ్‌ చేశారు. 

ఇక కొద్ది రోజుల క్రితమే బాలీవుడ్‌ నటి మీరా చోప్రా బంధువులు కరోనా కారణంగా చనిపోయిన సంగతి తెలిసిందే. కేవలం పది రోజుల వ్యవధిలోనే ఆమె తన ఇద్దరు కజిన్స్‌ను పోగొట్టుకున్నారు. అయితే వారు కోవిడ్‌ వల్ల చనిపోలేదని,  సరైన వైద్యం అందక మరణించారని మీరా చోప్రా ఇటీవలె వెల్లడించిన సంగతి తెలిసిందే. బెంగళూరులో రెండు రోజుల వరకు ఐసీయూ బెడ్‌ దొరక్క ఒకరు మరణిస్తే..ఆక్సిజన్‌ అందక మరొక కజిన్‌ చనిపోయారని పేర్కొంది. ఇద్దరూ దాదాపు 40 ఏళ్ల వయసు వారేనని, కానీ  అప్పుడే ఈ లోకాన్ని వదిలి వెళ్లాల్సిన పరిస్థితి దాపరించిందని ఆవేదన వ్యక్తం చేసింది. 

చదవండి : ప్రియాంక వల్ల సినిమా ఛాన్స్‌లు రాలేదు : మీరా చోప్రా
ప్రియాంకతో పెళ్లి వచ్చే జన్మలో అయినా..

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

RGV: ఆర్జీవీ వ్యూహం.. రిలీజ్ డేట్‌పై క్రేజీ అప్‌డేట్!

నటుడి కుమారుడికి స్టార్ క్రికెటర్ పాఠాలు.. వీడియో వైరల్!

ప్రపంచ సుందరిగా ఎంపికైన నికరాగ్వా భామ!

WC final 2023: కప్‌ భారత్‌దే.. రోహిత్‌ శర్మదే కీలక పాత్ర: వెంకటేశ్‌,తరుణ్‌

అక్క టాలీవుడ్.. చెల్లి కోలీవుడ్.. ఎంట్రీ అదిరిపోయింది!