More

ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

24 May, 2021 17:40 IST

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి.  నిన్న 18,767 కేసులు నమోదు కాగా, ఇవాళ కేవలం 12,994 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో  58,835 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 12,994 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 15,90,926 మందికి కరోనా వైరస్‌ సోకింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 104 మంది మృత్యువాతపడ్డారు. 

గడిచిన 24 గంటల్లో 18,373 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 13 లక్షల 79 వేల 837 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శుక్రవారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 2,03,762 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 1,86,76,222  కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.

చదవండి: 45 ఏళ్లు దాటిన వారికే వ్యాక్సిన్‌

కరోనా మరణాలపై వైద్యారోగ్యశాఖ అధికారుల నివేదిక
కరోనా మరణాలపై వైద్యారోగ్యశాఖ అధికారుల నివేదిక విడుదల చేశారు. అందులో 60-80 ఏళ్ల మధ్య వృద్ధుల్లో కరోనా మరణాలు తగ్గిన్నట్లు తెలిపారు. సెకండ్‌ వేవ్‌లో 30-50 ఏళ్ల మధ్య ఎక్కువగా చనిపోతున్నట్లు ధృవీకరించారు. ఇక గ్రామాల్లోనూ.. పట్టణాల్లోనూ సమానంగా కరోనా మరణాలు నమోదవుతున్నట్లు పేర్కొన్నారు. అర్బన్ ప్రాంతంలో 50.4 శాతం, పల్లెల్లో 49.6 శాతం మరణాలున్నట్లు వెల్లడించారు. రెండో దశ కరోనాలో 41-50 మధ్య వారు ఎక్కువగా మృతి చెందినట్లు నిర్థారించారు. గతేడాది మొదటి వేవ్‌తో పోలిస్తే సెకండ్‌ వేవ్‌లో 41-50 మధ్య వయస్సులో 5.96 శాతం మేర కరోనా మరణాలు పెరిగాయి. 

వయసు పరంగా మరణాల నమోదు
31-40 ఏళ్ల మధ్య 5.19 శాతం మేర పెరిగిన కరోనా మరణాలు
51-60 ఏళ్ల మధ్య 2.04 శాతం మేర పెరిగిన కరోనా మరణాలు
61-70 ఏళ్ల మధ్య 6.11 శాతం మేర తగ్గిన కరోనా మరణాలు
71-80 ఏళ్ల మధ్య 4.90 శాతం మేర తగ్గిన కరోనా మరణాలు
80 ఏళ్లు పైబడినవారిలోనూ 1.37 శాతం మేర తగ్గిన మరణాలు

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై సీఎం జగన్‌ సమీక్ష

విజయవాడ: సెమీ క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్‌ 

ఏపీలో చిత్రపరిశ్రమ అభివృద్ధిపై సీఎం జగన్ మార్క్

ఆత్మశాంతి చేస్తారా భువనేశ్వరీ!

అనంతపురం: రూ. 46 లక్షల చోరీ ఘటన.. అంతా డ్రామా..