Breaking News

జహంగీర్ పీర్ దర్గాను అభివృద్ధి చేస్తా

Published on Thu, 04/14/2016 - 00:10

మౌలిక వసతుల కల్పనకు భూమి కేటాయిస్తాం
♦ సీఎం కేసీఆర్ హామీ
♦ అజ్మీర్ దర్గాకు రాష్ట్రం తరఫున చాదర్, నజరానాలు
 
 సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాలోని జహంగీర్ పీర్ దర్గాను అభివృద్ధి చేస్తామని, దర్గా సందర్శకులకు వసతితోపాటు అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారు. బుధవారం జహంగీర్ పీర్ దర్గా అభివృద్ధిపై ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు లక్ష్మారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఏసీబీ డీజీ ఏకే ఖాన్, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఉమర్ జలీల్‌లతో క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ సమీక్షించారు. సమైక్య పాలనలో హిందూ దేవాలయాలతో పాటు ముస్లిం, ఇతర మతస్తుల ప్రార్థనా స్థలాలనూ నిర్లక్ష్యం చేశారని సీఎం కేసీఆర్ ఆరోపించారు.

ఉద్యమ సమయంలో తాను అనేక సార్లు జహంగీర్ పీర్ దర్గాను సందర్శించానని.. అన్ని మతాల వారూ వేల సంఖ్యలో అక్కడికి వెళ్తారని పేర్కొన్నారు. ఎంతో ప్రాశస్త్యం, ఆదరణ ఉన్నా... ప్రభుత్వపరంగా ఎలాంటి సహకారం అందకపోవడం విచారకరమని వ్యాఖ్యానించారు. ఈ దర్గాను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని, దర్గా సమీపంలోని ప్రభుత్వ భూమిని వసతుల కల్పనకు వినియోగిస్తామని చెప్పారు. దర్గాకు వెళ్లి పరిస్థితిని పరిశీలించాలని, అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయాలో సూచించాలని ఏసీబీ డీజీ ఏకే ఖాన్, మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ శ్రీదేవిని సీఎం ఆదేశించారు. దర్గా లోపల కూడా సులభంగా మొక్కులు చెల్లించుకునేలా నిర్మాణాలను సరిచేయాలని సూచించారు.

 అజ్మీర్ దర్గాకు చాదర్
 రాజస్తాన్‌లోని అజ్మీర్ దర్గాలో తెలంగాణ రాష్ట్రం తరఫున సమర్పించే చాదర్‌ను సీఎం కేసీఆర్ బుధవారం క్యాంపు కార్యాలయం నుంచి పంపించారు. ఐదు రోజుల నుంచి జరుగుతున్న అజ్మీర్ దర్గా ఉత్సవాలు గురువారం ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో చాదర్‌తో పాటు ప్రత్యేక నగదు, నజరానాలను కూడా మైనారిటీ సంక్షేమశాఖ కార్యదర్శి ఉమర్ జలీల్, వక్ఫ్‌బోర్డు సీఈవో అసదుల్లా ద్వారా పంపారు. అంతకు ముందు ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థన చేశారు.

Videos

Nallakunta: ప్రతి సంవత్సరం వర్షం వస్తే ఇదే పరిస్థితి అంటూ కాలనీవాసుల ఆవేదన

శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద ఉధృతి

ఐర్లాండ్ లో బయటపడిన భయానక రహస్యం

కుండబద్దలుకొట్టిన DGలు

అమెరికా రాజకీయాలను కుదిపేస్తున్న జెఫ్రీ ఎప్‌స్టీన్‌ కేసు

దమ్ముంటే ఆధారాలు చూపించండి.. లిక్కర్ కేసుపై శైలజానాథ్ రియాక్షన్

Visakhapatnam: ఐటీసీ గోడౌన్ లో చెలరేగిన మంటలు

Etela: నాపై సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేసే ఒక్కొక్కడికి

విశాఖలోని స్పా సెంటర్లపై టాస్క్ ఫోర్స్ దాడులు

మిథున్ రెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తారు: అంబటి రాంబాబు

Photos

+5

కొంపల్లిలో సందడి చేసిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

విశాఖపట్నం : ఐఎన్‌ఎస్‌ నిస్తార్‌ జాతికి అంకితం (ఫొటోలు)

+5

ట్రైలర్ లాంచ్ ఈవెంటో మెరిసిన నటి డింపుల్ హయాతీ (ఫొటోలు)

+5

విజయవాడ : సారె తెచ్చి..మనసారా కొలిచి..కిక్కిరిసిన ఇంద్రకీలాద్రి (ఫొటోలు)

+5

జడివానకు హైదరాబాద్‌ అతలాకుతలం.. ట్రాఫిక్‌ జామ్‌తో చుక్కలు చూసిన వాహనదారులు (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన..చెరువుల్లా మారిన రోడ్లు (ఫొటోలు)

+5

‘నా సీతా సీమంతం’ శ్రీమతి సీమంతంపై బిగ్‌బాస్‌ ఫేం పోస్ట్‌ (ఫొటోలు)

+5

‘నేను నా శివయ్య’ అంటున్న ఈ భక్తురాల్ని చూశారా?

+5

చందమామలా.. చీర సింగారించుకుని క్యూట్‌గా తెలుగు బ్యూటీ!

+5

ఆంధ్రా సరిహద్దులో.. ఉరకలేస్తున్న జలపాతాలు(చిత్రాలు)