Breaking News

చంద్రబాబును ఎందుకు అరెస్ట్‌ చేయరు?

Published on Thu, 04/27/2017 - 14:57

హైదరాబాద్‌ : ఈసీకి లంచం ఇవ్వజూపిన కేసులో దినకరన్‌ను అరెస్ట్ చేసినప్పుడు ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు నాయుడును ఎందుకు అరెస్ట్‌ చేయరని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ సూటిగా ప్రశ్నించారు. గురువారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో మరో దోపిడీకి తెర తీస్తున్నారని  ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భావనపాడు పోర్టుకు గ్లోబల్‌ టెండర్లు ఎందుకు పిలవలేదని బొత్స ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

పోర్టు ఆదాయంలో 2.3 శాతం వాటాను రాష్ట్ర  ప్రభుత్వానికి ఇవ్వడానికి జరిగిన ఒప్పందాల వెనక ఉన్న లొసుగులు ఏంటో బయటపెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఎన్నికల సమయంలో డబ్బు సంచులు మోసినవారికి నామినేషన్‌ పద్ధతిలో కాంట్రాక్టులు ఇస్తున్నారని బొత్స ఆరోపించారు.

పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు పనుల్లో దోచుకున్నట్లుగానే భావనపాడులో కూడా మరో దోపిడికి సిద్ధమయ్యారన్నారు. కిరీటాలు ఉత్తరాంధ్రకు కాదని, ఆయన కుటుంబానికే అని అన్నారు. ఇకనైనా చంద్రబాబు అబద్ధాలు ఆడటం ఆపాలని బొత్స సూచించారు. ఇసుక దోపిడీని మొదటే అడ్డుకుని ఉంటే చిత్తూరు జిల్లా ఏడ్పేరు ప్రమాదం జరిగేది కాదని ఆయన అన్నారు.

Videos

విడదల రజిని ఘటనపై ఎంపీ తనుజా రాణి ఫైర్

వైఎస్ఆర్ సీపీకి చెందిన ప్రజా ప్రతినిధి కల్పనపై అక్రమ కేసు

కోట శ్రీనివాస్ కోడి లెక్కన్నే ఉన్నయ్.. సూపర్ సిక్స్ పథకాలు

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్‌

వరంగల్ పర్యటనకు ప్రపంచ సుందరీమణులు..

కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వట్లేదు.. డీజీపీపై అంబటి ఫైర్

అణ్వాయుధాలకు బెదిరే ప్రసక్తేలే..!

విచారణ పేరుతో గోవిందప్ప కుటుంబంపై సిట్ వేధింపులు

అబద్ధపు వాంగ్మూలాలతో లేని మద్యం కేసు.. బాబు కుట్ర రాజకీయాలు

మద్యం కేసులో ఏపీ ప్రభుత్వ యంత్రాంగం తీరుపై సుప్రీంకోర్టు విస్మయం

Photos

+5

అంగరంగ వైభవంగా తిరుపతి గంగమ్మ జాతర..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

దారి వెంట నీరాజనం..‘జై జగన్‌’ అంటూ నినాదాలు (ఫొటోలు)

+5

#MissWorld2025: బ్యూటీ విత్‌ ఫన్‌..‘బుట్ట బొమ్మా’ పాటకు స్టెప్పులు (ఫొటోలు)

+5

చౌమహల్లా ప్యాలెస్‌లో యువరాణుల్లా మెరిసిన సుందరీమణులు (ఫొటోలు)

+5

చార్మినార్ దగ్గర మిస్‌ వరల్డ్‌ అందాలభామల ఫోటోషూట్ (ఫొటోలు)

+5

భావితరాలు మీరు ఆదర్శం: భారత సైన్యానికి మోదీ సెల్యూట్ (ఫొటోలు)

+5

హీరో గోపీచంద్ వెడ్డింగ్ యానివర్సరీ (ఫొటోలు)

+5

నిర్మాత ఇషారీ గణేశ్ కూతురి రిసెప్షన్.. హాజరైన స్టార్స్ (ఫొటోలు)

+5

ఏపీలో ప్రసిద్ధ వాడపల్లి.. 7 శనివారాల వెంకన్న ఆలయం.. మీరు ఎప్పుడైనా వెళ్ళారా (ఫొటోలు)

+5

ఖరీదైన ఇల్లు కొన్న 'అనసూయ'.. గృహ ప్రవేశం ఫోటోలు చూశారా?