More

ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే: విజయ సాయిరెడ్డి

12 Dec, 2019 18:48 IST

సాక్షి, న్యూఢిల్లీ:  స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తున్న నేపథ్యంలో పార్లమెంటు, అసెంబ్లీలో రిజర్వేషన్లు  ఎందుకు ఇవ్వడం లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయ్‌సాయి రెడ్డి గురువారం రాజ్యసభలో ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీలకు చట్టసభల్లో మరో పదేళ్ల రిజర్వేషన్ల పొడగింపుపై 126వ ఆర్టికల్‌ సవరణ బిల్లుపై రాజ్యసభలో ఇవాళ చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని గతంలో తాను ప్రైవేటు బిల్లు ప్రవేశ పెట్టినట్లు తెలిపారు.

దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల కల్పించాలని అసెంబ్లీ తీర్మానం కూడా చేశారని, బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించి తీరాల్సిందేనని డిమాండ్‌ చేశారు. అలాగే 70 ఏళ్లలో ఎస్సీ, ఎస్టీ స్థితిగతులు మారలేదని,  దేశాన్ని 50 ఏళ్లుగా పరిపాలించిన కాంగ్రెస్‌ పార్టీ దీనికి బాధ్యత వహించాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీల పేరుతో నినాదాలు ఇవ్వడం తప్ప వారి అభివృద్ది కోసం చేసిందేమి లేదని, రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెట్టి కాంగ్రెస్‌ పార్టీ పరిపాలన చేసిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీల అభివృద్ది కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చర్యలు చేపట్టింది అని తెలిపారు. అసెంబ్లీలో 225 సీట్లు పెంచాలని ఏపీ విభజన చట్టం చెబుతోందని, ఆ దిశగా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాల్సి ఉందని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

పరారీలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర

విజయనగరం జిల్లా: టీ కాస్తుండగా పేలిన గ్యాస్‌ సిలిండర్‌

దేశంలోనే నంబర్‌ 1 మెరైన్‌ స్టేట్‌ ‘ఏపీ’

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Nov 19th: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌