Anantapur: ఘోర రోడ్డు ప్రమాదం ఒకరు సజీవదహనం
Breaking News
నిత్యా మీనన్ కొత్త సినిమా.. పలువురికి ఆదర్శంగా నిలిచిన నటి!
Published on Tue, 06/09/2026 - 10:11
దక్షిణాది నటీమణుల్లో నటి నిత్యామీనన్ ప్రత్యేకమనే చెప్పాలి. చాలా ముక్కుసూటి మనిషి. మనసులో అనిపించింది చెప్పే భామ. పాత్రల్లో జీవించే నటీమణి. కాస్త బొద్దుగా ఉన్నా, దాన్నే అలంకారంగా భావించే బ్యూటీ. కథా పాత్రలు నచ్చితేనే నటించడానికి అంగీకరించే నటి. విమర్శలను అస్సలు పట్టించుకోని సంచలన నటి. సెలెక్టీవ్ చేసే నిత్యామీనన్ ఇటీవల తమిళంలో నటించిన తలైవన్ తలైవి చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత మరో చిత్రం కమిట్ కానీ ఈమెను తాజాగా ఒక కథ తెగ నచ్చేసిందట.
దీంతో ఆ చిత్రంలో నటించడానికి పచ్చజెండా ఊపేసినట్లు తాజా సమాచారం. అవును ఇంతకు ముందు యామిరుక్క భయమే, కాట్టేరి, కవల్ వేండామ్ వంటి చిత్రాలను తెరకెక్కించిన డీకే తాజాగా తన కొత్త చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు. ఉమెన్ సెంట్రిక్ కథాంశంతో రూపొందిస్తున్న ఈ చిత్రంలో నటి నిత్యామీనన్ ప్రధాన పాత్రను పోషించనున్నారు. ఈమెకు దర్శకుడు కథ చెప్పగానే తెగ నచ్చేసిందనీ దీంతో ఆమె వెంటనే నటించడానికి అంగీకరించినట్లు సమాచారం.
విశేషం ఏమిటంటే ఈ చిత్రంలో నటించడానికి చిన్న మొత్తాన్నే అడ్వాన్స్‌గా తీసుకున్నారని, మిగిలింది చిత్రానికి వచ్చే లాభాల్లో షేర్‌ను తీసుకోవడానికి నిత్యామీనన్ అంగీకరించినట్లు సమాచారం. చాలాకాలంగా నిర్మాతలు కోరుకుంటోంది ఇదే కావడంతో.. ఈ విషయంలో పలువురికి నిత్య మీనన్ మార్గదర్శిగా నిలుస్తారని చెప్పవచ్చు. కాగా ఈమె నటించనున్న తాజా చిత్రానికి సంబంధించి న పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా, వెల్లడించే అయ్యే అవకాశం ఉంది.
Tags : 1