Breaking News

విమానయాన రంగానికి ఇంధన గండం!

Published on Mon, 06/08/2026 - 17:57

ప్రపంచ విమానయాన రంగాన్ని మిడిల్ ఈస్ట్ సంక్షోభం కుదిపేస్తోంది. ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయెల్‌ల యుద్ధ వాతావరణం కారణంగా అంతర్జాతీయంగా జెట్ ఇంధన (ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యుయెల్‌-ఏటీఎఫ్‌) సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కీలకమైన ఎయిర్ కారిడార్లు మూతపడటంతో విమానాలను సుదూర ప్రాంతాల మీదుగా దారి మళ్లించాల్సి వస్తోంది. ఫలితంగా ఇంధన ఖర్చులు రికార్డు స్థాయికి చేరాయి. ఈ పెరిగిన భారంతో మున్ముందు కొన్ని విమానయాన సంస్థలు దివాలా తీసే ప్రమాదం ఉందని అంతర్జాతీయ విమానయాన రవాణా సంస్థ (ఐఏటీఏ) హెచ్చరించింది. రియో డి జనీరోలో జరిగిన ఐఏటీఏ వార్షిక సర్వసభ్య సమావేశంలో సంస్థ డైరెక్టర్ జనరల్ విల్లీ వాల్ష్ రాయిటర్స్ సంస్థతో మాట్లాడుతూ పౌర విమానయాన రంగం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని విశ్లేషించారు.

బడ్జెట్ విమానయాన సంస్థలపైనే ‍ప్రభావం..

పెరుగుతున్న ఇంధన ధరల ప్రభావం పూర్తిస్థాయి సేవలందించే పెద్ద ఎయిర్‌లైన్స్ కంటే తక్కువ ధరలకే సేవలందించే ‘బడ్జెట్ క్యారియర్ల’పైనే ఎక్కువగా పడుతోందని ఐఏటీఏ స్పష్టం చేసింది. ‘పెద్ద విమానయాన సంస్థలకు ప్రీమియం క్యాబిన్లు, అధిక ఛార్జీలు చెల్లించే బిజినెస్ ప్రయాణికులు, క్రెడిట్ కార్డ్ లాయల్టీ ప్రోగ్రామ్‌ల ద్వారా అదనపు మార్జిన్ ఆదాయం లభిస్తుంది. బడ్జెట్ ఎయిర్‌లైన్స్‌కు ఇలాంటి అదనపు వనరులు ఉండవు’ అని ఐటీఏటీ తెలిపింది. అమెరికాకు చెందిన ప్రముఖ బడ్జెట్ ఎయిర్‌లైన్ ‘స్పిరిట్ ఎయిర్‌లైన్స్’ గత నెలలో భారీగా నష్టపోయింది. రాబోయే రోజుల్లో మరికొన్ని చిన్న సంస్థలు వ్యాపారాల నుంచి తప్పుకోవడమో లేదా పెద్ద క్యారియర్ల చేతుల్లోకి వెళ్లిపోవడమో తప్పదని విల్లీ వాల్ష్ ఆందోళన వ్యక్తం చేశారు.

టికెట్ ధరలు తగ్గే ప్రసక్తే లేదు!

ప్రస్తుత సంక్షోభం నేపథ్యంలో విమానయాన సంస్థలు తమ నష్టాలను/మార్జిన్లను కాపాడుకోవడానికి లాభసాటి కాని మార్గాల్లో సర్వీసులను నిలిపివేస్తున్నాయి. ఇరాన్ వివాదం మొదలైనప్పటి నుంచి పెరిగిన విమాన ప్రయాణ ఛార్జీలు సమీప భవిష్యత్తులో తగ్గే అవకాశం లేదని వాల్ష్ తేల్చిచెప్పారు. ప్రస్తుత తరుణంలో అధిక ఇంధన ధరలను తట్టుకుని నిలబడటం చాలా కష్టమన్నారు. అమెరికా మార్కెట్‌లో మాత్రం యునైటెడ్, డెల్టా, అమెరికన్ ఎయిర్‌లైన్స్ వంటి క్యారియర్లు చిన్న బడ్జెట్ పోటీదారులను గట్టిగా అణచివేస్తున్నాయని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: వ్యర్థాల్లో దాగున్న బంగారు అవకాశం!

#

Tags : 1

Videos

Viral Video: సగం తిన్న యాపిల్ ను జనాల్లోకి విసరిన డీకే శివకుమార్

ఇంత దరిద్రపు పాలనను .. ఎప్పుడు చూడలేదు..!

స్టీల్ ప్లాంట్ ప్రమాద మృతుల కుటుంబాలకు బొత్స పరామర్శ

రేపు విశాఖలో జగన్ పర్యటన

ట్రంప్ ఒక్క ఫోన్ కాల్‌తో వెనక్కి తగ్గిన..!

ప్రస్టేషన్ ఎక్కువై YSRపై నిందలు, KVP మొట్టికాయలు

నారాసుర గొడ్డలిపోటు... చంద్రబాబు వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి ఫైర్

పాపం.. కారున్నా నడపలేడు బుడ్జోడికి ఎంత కష్టం వచ్చిందో

చంపేస్తాం.. వైఎస్ఆర్ సీపీ నేతలకు జేసీ బెదిరింపులు

స్టీల్ ప్లాంట్లో ప్రమాదాల వెనుక కారణం ఇదే?

Photos

+5

కొంచెం క్లాస్... కొంచెం మాస్.. అనిష్మా ‘యూత్‌’ఫుల్‌ ఫోటోస్‌

+5

బాలీవుడ్ బ్యూటీ నేహ కక్కర్‌ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

తన ముద్దుల గారాలపట్టితో బిగ్‌బాస్ శివజ్యోతి బొబ్బట్ల పండుగ (ఫొటోలు)

+5

శారీలో అనసూయ గ్లామర్ చూశారా? (ఫొటోలు)

+5

బ్లాక్‌ డ్రెస్‌లో ప్రియాంక మోహన్‌ స్టన్నింగ్‌ స్టిల్స్‌

+5

టాలీవుడ్ నటి అభినయ స్మైలీ లుక్స్.. ఫోటోలు

+5

క్యూట్‌నెస్‌తో కట్టిపడేసిన భైరవి.. ఎవరీ బ్యూటీ?

+5

హైదరాబాద్​: మహిళల కోసం మహిళలే డ్రైవర్లుగా..

+5

కదం తొక్కిన కాక్రోచ్‌.. జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా (చిత్రాలు)

+5

రామ్ చరణ్‌ ‘పెద్ది’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)