Anantapur: ఘోర రోడ్డు ప్రమాదం ఒకరు సజీవదహనం
Breaking News
టాక్సిక్ డైరెక్టర్ బర్త్ డే.. స్పెషల్ వీడియో వైరల్
Published on Mon, 06/08/2026 - 15:17
యశ్ హీరోగా వస్తోన్న యాక్షన్ మూవీ టాక్సిక్.. ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్అప్స్. ఈ మూవీ గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా అనూహ్యంగా వాయిదా పడింది. టాక్సిక్ పోస్ట్‌పోన్ కావడంతోనే రామ్ చరణ్ పెద్ది థియేటర్లలోకి వచ్చేసింది. అయితే ఇవాళ టాక్సిక్ మూవీ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ బర్త్ డే కావడంతో మేకర్స్ ప్రత్యేక వీడియో పంచుకున్నారు. ఆమె మూవీ షూటింగ్లో సీన్స్ తెరకెక్కించిన విధానాన్ని చూపించారు. ఈ వీడియో చూస్తుంటే టాక్సిక్ కోసం ఆమె ఎంత డెడికేషన్‌తో పనిచేశారో తెలుస్తోంది. ఈ సందర్భంగా పలువురు సినీతారలు గీతూకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.
టీజర్‌పై విమర్శలు..
అయితే గతంలో టాక్సిక్ టీజర్ రిలీజ్ చేయగా పెద్దఎత్తున విమర్శలకు గురైంది. ఆ టీజర్లో ఇంటిమేట్ సీన్ కాస్తా ఓవర్‌గా ఉందంటూ పలువురు విమర్శించారు. లేడీ డైరెక్టర్ కావడంతో ఇలాంటి సీన్స్ తెరకెక్కించడంపై వివాదానికి కారణమైంది. కానీ ఇలాంటివీ సినిమా కోణంలోనే చూడాలని మరికొందరు కామెంట్స్ చేశారు. మొత్తానికి టీజర్‌తోనే టాక్సిక్‌పై అంచనాలు ఒక్కసారిగా పెంచేసింది గీతూ మోహన్‌దాస్.
Behind every shot that hit different, every silence that said more than dialogue ever could, there she was!❤️🔥
Happy birthday, Geetu Mohandas ✨️#Toxic#ToxicTheMovie@TheNameIsYash#Nayanthara @advani_kiara@humasqureshi @rukminitweets #TaraSutaria #GeetuMohandas… pic.twitter.com/PjtUiLlDhi— TOXIC (@Toxic_themovie) June 8, 2026
Tags : 1