Breaking News

145 కేజీల నుంచి 90 కేజీలకు..! ఆ ఏడు ఆహారాలు..

Published on Mon, 06/08/2026 - 08:04

బరువు తగ్గడం అంటే కేలరీల లోటు, జిమ్‌లో ఎక్కువ గంటలు గడపడం వంటివి మాత్రమే అనుకుంటాం. కానీ దాంతోపాటు ఇతర మార్పులు కూడా తప్పనిసరి. ముఖ్యంగా జీవనశైలిలోని ఆహారపు అలవాట్లే అత్యంత ప్రధానం. తీసుకునే ఆహారం పోషకవంతమైనది, బరువు అదుపులో ఉంచేది తీసుకుంటే అద్భుతాలు సృష్టించొచ్చు అని అంటోంది ఈ ముంబై ఇన్‌ఫ్లుయెన్సర్‌. ఆమె ఒకప్పుడు ఏకంగా 145 కేజీల పైనే బరువు ఉండేదాన్ని అని తెలిపింది. ఇప్పుడు ఏకంగా 55 కేజీల బరువు తగ్గి నాజుగ్గా మారానని, అందుకోసం ఆ ఏడు ఆహారాలను తీసుకుంటున్నానంటూ తన వెయిట్‌లాస్‌ సీక్రెట్‌ని వెల్లడించారామె. మరి ఆ ఆహారాలేంటో సవివరంగా తెలుసుకుందామా..!.

ముంబై ఫిట్‌నెస్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ డాలీ సుమారు 145 నుంచి 90 కేజీ బరువు తగ్గేందుకు చేసిన ఆ ఏడు ఆహార మార్పుల గురించి సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంది. ఆ పోస్ట్‌లో తాను చేసిన ఈ ఆహారపు మార్పులు అదనపు కేలరీలను తగ్గించి..వేగంగా బరువు తగ్గేందుకు సహాయపడిందని నమ్మకంగా చెబుతోందామె. మరి అవేంటంటే..

చక్కెర పానీయాలు
డాలీ చక్కెర పానీయాలను పూర్తిగా దూరంగా ఉన్నట్లు తెలిపింది. ఈ చక్కెర పానీయాలను అధికంగా తీసుకోవడం వల్ల అధిక కేలరీలు శరీరంలోకి చేరి, బరువు పెరిగే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. దానికి బదులుగా, తాను నిమ్మరసం, కొబ్బరి నీరు, చక్కెర లేని గ్రీన్ టీ వంటి ప్రత్యామ్నాయాలను తీసుకున్నట్లు డాలీ వెల్లడించింది. 

తెల్ల రొట్టె(మైదాతో చేసేవి)
శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచి, అతిగా తినడానికి దారితీస్తుంది. కాబట్లి ఆమె తెల్ల రొట్టెను పూర్తిగా తగ్గించేసింది. దానికి బదులుగా ఆ ఇన్‌ఫ్లుయెన్సర్ గోధుమ రొట్టె, మల్టీగ్రెయిన్ బ్రెడ్, ఓట్స్‌ను తీసుకోవడం ప్రారంభించింది.

చిప్స్, ప్యాక్ చేసిన స్నాక్స్
వాటిలో ఉప్పు, కేలరీలు అధికంగా ఉండటం వల్ల ఆమె చిప్స్, ప్యాక్ చేసిన స్నాక్స్ తినడం మానేసినట్లు పేర్కొంది. దానికి బదులుగా ఆమె మితంగా వేయించిన మఖానా, వేయించిన శనగలు, నట్స్‌ను ఎంచుకుంది.

ఫాస్ట్ ఫుడ్
ఫాస్ట్ ఫుడ్‌లో కొవ్వు, ఉప్పు, కేలరీలు అధికంగా ఉండటం వల్ల దానిని పూర్తిగా తగ్గించేసింది. దానికి బదులుగా డాలీ పనీర్ శాండ్‌విచ్‌లు, గోధుమ కూరగాయల ర్యాప్‌లు లేదా ఇంట్లో తయారుచేసిన భోజనం వంటి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకుందామె.

ఐస్ క్రీమ్
ఐస్ క్రీమ్‌లో తరచుగా చక్కెర,కేలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దానిని తన ఆహారం నుంచి తొలగించింది. గ్రీక్ యోగర్ట్, పండ్లు, ఫ్రోజెన్ బనానా స్మూతీలు లేదా చిన్న మొత్తంలో డార్క్ చాక్లెట్ తినడం ద్వారా ఆమె తన కోరికలను నియంత్రించుకుంది.

మద్యం
మద్యపానం డీహైడ్రేషన్‌కు, ముఖం ఉబ్బడానికి కారణమవుతుందని అందుకే తాను దానిని పూర్తిగా మానేసినట్లు తెలిపింది డాలీ. నిమ్మరసం కలిపిన సోడా నీరు, చక్కెర కలపని తాజా పండ్ల రసం, డిటాక్స్ వాటర్ ఆమె ఇష్టపడే ప్రత్యామ్నాయాలుగా మారాయి.

ప్రాసెస్ చేసిన ఆహారాలు
ప్రాసెస్ చేసిన ఆహారాలలో తరచుగా సోడియం సంకలితాలు అధికంగా ఉంటాయి కాబట్టి వాటిని మానేశారు. దానికి బదులుగా, ఆమె గుడ్లు, టోఫు, పనీర్, పెరుగు, పప్పుధాన్యాలు, మొక్కల ఆధారిత ప్రోటీన్ వంటి సహజమైన ఆహార వనరులపై దృష్టి సారించింది.

పైన  చెప్పిన ఈ ఆహార పదార్థాలను పూర్తిగా తగ్గించి.. ఎక్కువ నీరు తీసుకుంటూ.. బాగా నిద్రపోండి. అలాగే మీరు నిర్దేశించుకున్న డైట్‌ క్రమం తప్పకుండా ఉండేలా చూసుకోమని సూచిస్తోంది. ఇలా చేస్తే కచ్చితంగా శరీరం వేగంగా నాజూకుగా మారుతుందంటూ తన పోస్ట్‌ని ముగించింది డాలీ.

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

(చదవండి:  ఒక్క ఏడాదిలో 35 కిలోలు..!ఆ ఆరుబోరింగ్‌ అలవాట్లు..)
 

Videos

Viral Video: సగం తిన్న యాపిల్ ను జనాల్లోకి విసరిన డీకే శివకుమార్

ఇంత దరిద్రపు పాలనను .. ఎప్పుడు చూడలేదు..!

స్టీల్ ప్లాంట్ ప్రమాద మృతుల కుటుంబాలకు బొత్స పరామర్శ

రేపు విశాఖలో జగన్ పర్యటన

ట్రంప్ ఒక్క ఫోన్ కాల్‌తో వెనక్కి తగ్గిన..!

ప్రస్టేషన్ ఎక్కువై YSRపై నిందలు, KVP మొట్టికాయలు

నారాసుర గొడ్డలిపోటు... చంద్రబాబు వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి ఫైర్

పాపం.. కారున్నా నడపలేడు బుడ్జోడికి ఎంత కష్టం వచ్చిందో

చంపేస్తాం.. వైఎస్ఆర్ సీపీ నేతలకు జేసీ బెదిరింపులు

స్టీల్ ప్లాంట్లో ప్రమాదాల వెనుక కారణం ఇదే?

Photos

+5

కొంచెం క్లాస్... కొంచెం మాస్.. అనిష్మా ‘యూత్‌’ఫుల్‌ ఫోటోస్‌

+5

బాలీవుడ్ బ్యూటీ నేహ కక్కర్‌ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

తన ముద్దుల గారాలపట్టితో బిగ్‌బాస్ శివజ్యోతి బొబ్బట్ల పండుగ (ఫొటోలు)

+5

శారీలో అనసూయ గ్లామర్ చూశారా? (ఫొటోలు)

+5

బ్లాక్‌ డ్రెస్‌లో ప్రియాంక మోహన్‌ స్టన్నింగ్‌ స్టిల్స్‌

+5

టాలీవుడ్ నటి అభినయ స్మైలీ లుక్స్.. ఫోటోలు

+5

క్యూట్‌నెస్‌తో కట్టిపడేసిన భైరవి.. ఎవరీ బ్యూటీ?

+5

హైదరాబాద్​: మహిళల కోసం మహిళలే డ్రైవర్లుగా..

+5

కదం తొక్కిన కాక్రోచ్‌.. జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా (చిత్రాలు)

+5

రామ్ చరణ్‌ ‘పెద్ది’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)