Breaking News

పప్పు కూర

Published on Mon, 06/08/2026 - 05:49

చెన్నైకి చెందిన ఒక సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగికి ప్రతి శనివారం తిరుమలకి వచ్చి వెళ్ళడం అలవాటు. ఉదయమే చెన్నై నుంచి కారులో బయలుదేరి కొండకు చేరేవాడు. కొండ దిగేంత వరకు పచ్చి మంచి నీళ్ళు కూడా తాగేవాడు కాడు. కుదిరితే స్వామివారి దర్శనం చేసుకునే వాడు. కుదరకపోతే ప్రశాంతంగా గుడి ముందర కూర్చునేవాడు. పుష్కరిణి దగ్గరకు వెళ్ళి తలమీద నీళ్ళు చల్లుకునే వాడు. 

వరాహస్వామి దర్శనం చేసుకునే వాడు. ఆపైన బేడి ఆంజనేయ స్వామి గుడి దగ్గర నిలబడి ఆలయ గోపురానికి నమస్కరించే వాడు. కర్పూర హారతి ఇచ్చి కొండ దిగేసే వాడు. తిరుపతిలో అతడికి పిల్లనిచ్చిన అత్తగారు ఉన్నారు. కొండ దిగిన ప్రతిసారీ అత్తగారి ఇంటికి వెళ్లి ఆమె బాగోగులు తెలుసుకునేవాడు. అల్లుడు వచ్చిన ప్రతిసారీ ఇంటి పెరట్లో ఉన్న అరటి చెట్టులోని కొన ఆకు కోసి తను చేసిన వేడి వేడి వంటలు వడ్డించేది. 

పచ్చటి అరిటాకులో పప్పుకూర వడ్డించేది. ఘుమఘుమలాడే నెయ్యి కూడా వేసేది. వెళ్ళిన ప్రతిసారీ ఆమె పప్పుకూరే చేసేది. ఎందుకంటే ఆమె పప్పు కూర మాత్రమే బాగా చేయగలదు. ఎంతో రుచిగా ఉన్నప్పటికీ వారం వారం పప్పుకూర తినలేక అల్లుడికి విసుగు వచ్చింది. ఒకరోజు ఏడుపు ముఖం పెట్టి ‘‘అత్తా, ఎప్పుడూ పప్పు కూరేనా? తినాలంటే మొహం మొత్తుతోంది’’ అన్నాడు.  ఆమె నవ్వింది.

‘‘అల్లుడూ... పప్పుకూర సరే, పదేళ్ళుగా తిరుమల వచ్చి వెళ్తున్నావు. గుడిలోని స్వామి అప్పుడూ, ఇప్పుడూ ఒక్కరే కదా... ఏ మాత్రం మార్పు లేదు కదా, నీకెప్పుడూ స్వామిని ‘చూసింది చాల్లే’ అనిపించలేదా?’’ అని అడిగింది.

అతడు నవ్వాడు.‘‘స్వామిని చూడటం  ‘చాలు’ అనిపించదత్తా. స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని ఎన్నిసార్లు దర్శించినా తనివి తీరదు. కొండకి వచ్చిన ప్రతిసారీ దర్శనం చేసుకుని బంగారు వాకిలి దాటి వచ్చేలోగా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఏమిటో ఈ మాయ’’ అంటూ చేయి కడిగాడు. అత్త తాను చేసిన పప్పు కూర కొద్దిగా గిన్నెలో పెట్టి కూతురికిమ్మనిచెప్పింది. అలాగేనని తల ఊపి ‘రాకుండా ఉండలేను నీ కొండకు... చూడకుండా ఉండలేను ఏ నాటికీ’ అని పాడుకుంటూ చెన్నైకి బయలుదేరాడు. ఆ రోజునుంచి అత్త ముందు పప్పు కూర మాట ఎత్తలేదు అల్లుడు.

– ఆర్‌.సి. కృష్ణస్వామి రాజు

Videos

Viral Video: సగం తిన్న యాపిల్ ను జనాల్లోకి విసరిన డీకే శివకుమార్

ఇంత దరిద్రపు పాలనను .. ఎప్పుడు చూడలేదు..!

స్టీల్ ప్లాంట్ ప్రమాద మృతుల కుటుంబాలకు బొత్స పరామర్శ

రేపు విశాఖలో జగన్ పర్యటన

ట్రంప్ ఒక్క ఫోన్ కాల్‌తో వెనక్కి తగ్గిన..!

ప్రస్టేషన్ ఎక్కువై YSRపై నిందలు, KVP మొట్టికాయలు

నారాసుర గొడ్డలిపోటు... చంద్రబాబు వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి ఫైర్

పాపం.. కారున్నా నడపలేడు బుడ్జోడికి ఎంత కష్టం వచ్చిందో

చంపేస్తాం.. వైఎస్ఆర్ సీపీ నేతలకు జేసీ బెదిరింపులు

స్టీల్ ప్లాంట్లో ప్రమాదాల వెనుక కారణం ఇదే?

Photos

+5

కొంచెం క్లాస్... కొంచెం మాస్.. అనిష్మా ‘యూత్‌’ఫుల్‌ ఫోటోస్‌

+5

బాలీవుడ్ బ్యూటీ నేహ కక్కర్‌ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

తన ముద్దుల గారాలపట్టితో బిగ్‌బాస్ శివజ్యోతి బొబ్బట్ల పండుగ (ఫొటోలు)

+5

శారీలో అనసూయ గ్లామర్ చూశారా? (ఫొటోలు)

+5

బ్లాక్‌ డ్రెస్‌లో ప్రియాంక మోహన్‌ స్టన్నింగ్‌ స్టిల్స్‌

+5

టాలీవుడ్ నటి అభినయ స్మైలీ లుక్స్.. ఫోటోలు

+5

క్యూట్‌నెస్‌తో కట్టిపడేసిన భైరవి.. ఎవరీ బ్యూటీ?

+5

హైదరాబాద్​: మహిళల కోసం మహిళలే డ్రైవర్లుగా..

+5

కదం తొక్కిన కాక్రోచ్‌.. జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా (చిత్రాలు)

+5

రామ్ చరణ్‌ ‘పెద్ది’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)