ఎందుకు అంత ఆవేశం.. అసెంబ్లీలో అచ్చైన్నాయుడు ఓవరాక్షన్
Breaking News
కారు వెనుక నెంబర్స్.. మీనింగ్ ఏంటో తెలుసా?
Published on Fri, 02/20/2026 - 19:45
సాధారణంగా ఒక కారును నిశితంగా పరిశీలిస్తే.. దాని ముందు, వెనుక బ్రాండ్ లోగో లేదా అక్షరాలు, సైడ్ డోర్స్ మీద కొన్ని స్టిక్కర్స్, వెనుక బీఎస్ 6 లేదా బీఎస్ 4 మోడల్స్ అని తెలిపే గుర్తులు వంటివి కనిపిస్తాయి. అయితే వెనుక భాగంలోనే 1.2, 1.5, 2.4 వంటి నెంబర్స్ కనిపిస్తుంటాయి. వీటి అర్థం కొందరికి తెలిసి ఉన్నా.. చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలు తెలుసుకుందాం.
కారు వెనుక కనిపించే ఈ నెంబర్స్.. మోడల్ నెంబర్స్ అనుకుంటే పొరపాటే. నిజానికి ఇవి ఇంజిన్ కెపాసిటీని సూచిస్తాయి. బైకులలో ఇంజిన్ కెపాసిటీని సీసీ అంటారు. ఉదాహరణకు 100 సీసీ ఇంజిన్, 150 సీసీ ఇంజిన్ ఇలా. ఇక్కడ సీసీ అంటే క్యూబిక్ సెంటీమీటర్ల అని అర్థం.
ఇదీ చదవండి: కారు లైఫ్ టైమ్ పెరగాలంటే.. ఇదిగో 5 జాగ్రత్తలు
కారు ఇంజిన్.. బైక్ ఇంజిన్ కంటే పెద్దదిగా ఉంటుంది. కాబట్టి కారు ఇంజిన్ కెపాసిటీని లీటర్లలో కొలుస్తారు. లీటర్ నెంబర్‌ను 1000తో గుణించడం ద్వారా.. కారు ఇంజిన్ సీసీ కెపాసిటీ తెలుస్తుంది. అంటే.. 1.2 అనేది 1200 సీసీ ఇంజిన్‌ను, 1.5 అనేది 1500 సీసీ ఇంజిన్‌ను సూచిస్తుంది. కారు వెనుక ఉన్న నెంబర్ ఎంత పెద్దది అయితే.. ఇంజిన్ పరిమాణం కూడా ఎక్కువ అని అర్థం చేసుకోవాలి. కొన్ని ప్రీమియం కార్లలో ఇంజిన్ కెపాసిటీ చాలా ఎక్కువగా ఉంటుంది.
Tags : 1