Breaking News

మీవల్లే ఈ వేదన.. కర్మ మిమ్మల్ని వదిలిపెట్టదు: మీనా

Published on Fri, 02/20/2026 - 14:42

సౌత్‌లో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది మీనా. రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌, అజిత్‌, చిరంజీవి, వెంకటేశ్‌, మోహన్‌లాల్‌, మమ్ముట్టి.. ఇలా అందరు హీరోలతోనూ యాక్ట్‌ చేసింది. కొన్నేళ్ల క్రితం మీనా భర్త విద్యాసాగర్‌ అనారోగ్యంతో కన్నుమూశాడు. దీంతో ఆమె కొంతకాలంపాటు తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది.

రెండో పెళ్లంటూ ప్రచారం
తీరని మనోవేదనతో ఆమె నరకం అనుభవిస్తుంటే సోషల్‌ మీడియాలో మాత్రం మీనాకు రెండో పెళ్లి అంటూ అసత్య ప్రచారం ఊపందుకుంది. దయచేసి ఇటువంటి రూమర్స్‌ వ్యాప్తి చేయకండి అని మీనా కోరడంతో కొంతకాలం ఆ గాసిప్స్‌ పత్తా లేకుండా పోయాయి. కానీ తర్వాత మళ్లీ అదే తంతు. ఏదో ఒక హీరోతో మీనాకు లింక్‌ పెట్టడం, త్వరలోనే రెండో పెళ్లంటూ ప్రచారానికి తెర తీయడం సర్వసాధారణమైపోయింది.

ఒంటరి ఆడదాన్ని అనేకదా!
ఈ వ్యవహారంపై మీనా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. నాకు రెండో పెళ్లి అని చెత్తంతా రాస్తున్నారు. అందులో నిజం ఉంటే మీరు మాట్లాడుకోవడంలో తప్పు లేదు. కానీ మీకు మీరే ఏదో ఊహించుకుని, కల్పించుకుని రాయడం ముమ్మాటికీ తప్పే! నేనొక ఒంటరి మహిళను, అందులోనూ సెలబ్రిటీని అనే కదా మీకు నచ్చినట్లు రూమర్స్‌ సృష్టిస్తున్నారు. నా సహనాన్ని పరీక్షిస్తున్నారు. పైగా నాకు ఓ కూతురుంది. 

మంచివాటిపై ఫోకస్‌ చేస్తా..
తను ఇవన్నీ చూస్తే ఏమనుకుంటుంది? ఇదంతా నాకెంతో అసౌకర్యంగా ఉంది, చాలా చిరాకు తెప్పిస్తోంది. దీన్ని భరించడం నావల్ల కావడం లేదు. కానీ కర్మ అనేది ఒకటుంది. అదెవర్నీ వదిలిపెట్టదు. ఈ అనవసర ప్రచారంపై స్పందించి నా సమయం, ఎనర్జీ, ఆరోగ్యాన్ని నాశనం చేసుకోదల్చుకోలేదు. నేను చాలా పాజిటివ్‌ వ్యక్తిని. ఎప్పుడూ సంతోషంగా, పాజిటివ్‌గా ఉండటానికే ప్రయత్నిస్తాను. మంచివిషయాలపైనే ఫోకస్‌ చేస్తాను అని మీనా చెప్పుకొచ్చింది.

చదవండి: అమ్మ ఉగ్రరూపం.. గొంతు పట్టుకుని చెంప చెళ్లుమనిపించింది: ప్రియాంక

Videos

ఎందుకు అంత ఆవేశం.. అసెంబ్లీలో అచ్చైన్నాయుడు ఓవరాక్షన్

వాడు పెద్ద సైకో..నన్ను వాడుకున్నాడు.. ఎప్ స్టీన్ బాధితురాలు రీనా వీడియో

Jupudi: ఎవడి డబ్బుతో క్రికెట్ మ్యాచ్ కు వెళ్ళావ్?

TDP ఎన్ని కుట్రలు చేసినా ఎంపీపీని కైవసం చేసుకున్న YSRCP

విజయ్, రష్మికల సంపాదన ఇద్దరి ఆస్తులు ఎన్ని కోట్లు అంటే..?

మళ్ళీ అవినీతి సామ్రాజ్యానికి నేనే మహా చక్రవర్తిని అన్నట్టు మాట్లాడతాడు

Khammam : డ్రగ్స్ మత్తులో ఇంటర్ విద్యార్థులు దారుణం

THE BLACKOUT డిజిటల్ చీకటి రాబోతోందా

లోకేష్ క్రికెట్ మ్యాచ్ ట్వీట్.. పుష్ప డైలాగ్ తో పేర్ని నాని కౌంటర్

ఆసీస్ ఆఖరి పోరాటం పరువు కోసం గెలుపు

Photos

+5

గ్రాండ్‌గా నిర్మాత కోన వెంకట్ బర్త్‌ డే వేడుకల్లో సినీతారల సందడి (ఫొటోలు)

+5

సింగర్ మంగ్లీ 'ఇషా' ట్రిప్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

ఆ ఆనందమే ఇదంతా..: నటి (ఫోటోలు)

+5

ట్రెండింగ్‪‌లో రుక్మిణి వసంత్ (ఫొటోలు)

+5

చాన్నాళ్లకు హైదరాబాద్‌లో కాజల్ అగర్వాల్ సందడి (ఫొటోలు)

+5

ఐకానిక్ గోల్డ్ అవార్డ్స్ వేదికపై మెరిసిన బాలీవుడ్ తారలు (ఫోటోలు)

+5

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)

+5

అందమే అసూయపడేలా! స్టేడియం మురిసేలా ఎవరి అందాల ‘ ఐరా’ (ఫొటోలు)

+5

ప్రియురాలు సోఫీ షైన్‌తో గబ్బర్‌ శిఖర్‌ పెళ్లి.. సంగీత్ నైట్‌ ఫోటోలు

+5

హైదరాబాద్ రంజాన్‌ స్పెషల్ రుచులు..మీరూ ఓ లుక్కేయండి (ఫొటోలు)