ఎందుకు అంత ఆవేశం.. అసెంబ్లీలో అచ్చైన్నాయుడు ఓవరాక్షన్
Breaking News
468 కిమీ రేంజ్ అందించే టాటా కొత్త కారు: ధర ఎంతంటే?
Published on Fri, 02/20/2026 - 14:37
టాటా మోటార్స్ కొత్త పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధరలు రూ. 9.69 లక్షల (ఎక్స్-షోరూమ్, ముంబై) నుంచి ప్రారంభమవుతాయి.
టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్‌లో ఒకే ఎలక్ట్రిక్ మోటారుతో జత చేసిన 40 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది ఒక ఫుల్ ఛార్జితో 468 కిమీ రేంజ్ అందిస్తుందని ఏఆర్ఏఐ సర్టిఫైడ్ చేసింది. అయితే రియల్ వరల్డ్ రేంజ్ 355 కిమీ వరకు ఉంటుందని సమాచారం. ఈ కారు 65 కిలోవాట్ ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 26 నిమిషాల్లో 20 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోగలదు.
టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఇల్యూమినేటెడ్ ఛార్జింగ్ స్టేటస్ ఇండికేటర్, మూడు డ్రైవ్ మోడ్లు (ఎకో, సిటీ, స్పోర్ట్), డ్యూయల్ టోన్ డ్యాష్‌బోర్డ్, కొత్త విండో కంట్రోల్ బటన్లు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వాయిస్ అసిస్టెడ్ సన్‌రూఫ్, వైర్లెస్ ఆపిల్ కార్ప్లే & ఆండ్రాయిడ్ ఆటో మొదలైనవి ఉన్నాయి.
ఇదీ చదవండి: కారు లైఫ్ టైమ్ పెరగాలంటే.. ఇదిగో 5 జాగ్రత్తలు
డిజైన్ పరంగా, రిఫ్రెష్డ్ ఫాసియా, చుట్టూ బూడిద రంగు బాడీ క్లాడింగ్, కొత్త ఎల్ఈడీ టెయిల్ లైట్స్, వెనుక భాగంలో ఎల్ఈడీ లైట్ బార్ ఉన్నాయి. మిగిలిన డిజైన్ దాదాపు సాధారణ ఏవీ పంచ్ మాదిరిగానే ఉంటుంది.
Tags : 1