ఎందుకు అంత ఆవేశం.. అసెంబ్లీలో అచ్చైన్నాయుడు ఓవరాక్షన్
Breaking News
స్వలింగ సంపర్క ప్రేమికురాలిగా రష్మిక?
Published on Fri, 02/20/2026 - 12:03
ఇండస్ట్రీలో ఒకప్పటితో పోలిస్తే పరిస్థితులు ఇప్పుడు చాలా మారిపోయాయి. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చూసే జనాలు తగ్గిపోయారు. హీరోహీరోయిన్లు ఎవరైనా సరే కాస్త వైవిధ్యమైన పాత్రలు చేస్తే చూసేందుకు ఏ మాత్రం వెనుకాడటం లేదు. అయితే అలాంటివి చేసే వాళ్లు మాత్రం ఇప్పటికే కాస్త తక్కువగానే ఉన్నారని చెప్పొచ్చు. కానీ రష్మిక మాత్రం ఇప్పుడు పెద్ద సాహసమే చేసినట్లు తెలుస్తోంది. తెలుగు ప్రేక్షకులు.. కనీసం కలలో కూడా ఊహించని పాత్రలో కనిపించనుందని టాక్ అయితే గట్టిగా వినిపిస్తోంది.
స్వతహాగా కన్నడ అమ్మాయి అయిన రష్మిక.. తొలుత సొంత భాషలో గుర్తింపు తెచ్చుకుని తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ మహేశ్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించి స్టార్డమ్ సొంతం చేసుకుంది. 'పుష్ప' మూవీతో పాన్ ఇండియా వైడ్ సెన్సేషన్ అయిపోయింది. గత కొన్నాళ్ల నుంచి బాలీవుడ్‌లోనూ వరస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. అలా ఈమె చేసిన హిందీ సినిమాల్లో 'కాక్టెయిల్ 2' కూడా ఒకటి.
(ఇదీ చదవండి: ఆ హీరోని చూసి నా ఎక్స్ భాయ్‌ఫ్రెండ్ భయపడ్డాడు: మృణాల్)
ఈ సినిమాలో షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక నటించారు. అయితే ఇదో ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని, కాకపోతే కృతి సనన్, రష్మిక.. స్వలింగ సంపర్క పాత్రల్లో కనిపించనున్నారని బాలీవుడ్ మీడియాలో గట్టిగా వినిపిస్తుంది. అంటే లెస్బియన్ పాత్రలు అనమాట. బాలీవుడ్ సినిమాల్లో ఈ పాయింట్ అప్పుడప్పుడు టచ్ చేస్తుంటారు గానీ దక్షిణాదిలో ఇలాంటి పాత్రలు రావడం దాదాపు అసాధ్యం. అందున స్టార్ హీరో లేదా హీరోయిన్లు ఇలాంటి చేయరు. మరి రష్మిక ఈ తరహా పాత్ర చేసిందని రూమర్స్ వస్తున్నాయి. ఒకవేళ ఇది నిజమైతే గనక తెలుగు ఆడియెన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి?
ఇకపోతే రష్మిక వచ్చే వారమే పెళ్లి చేసుకోనుంది. ప్రియుడు విజయ్ దేవరకొండతో కలిసి కొత్త జీవితం ప్రారంభించనుంది. రాజస్తాన్ వేదికగా ఈ నెల 26న డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుంది. ఈ శుభకార్యానికి ఇరువురి కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారు. మార్చి 4న హైదరాబాద్‌లో రిసెప్షన్ జరగనుంది.
(ఇదీ చదవండి: ఓటీటీలో మలయాళ యాక్షన్ కామెడీ సినిమా.. తెలుగు రివ్యూ)
Tags : 1