Breaking News

అరుణగ్రహమే టార్గెట్‌

Published on Fri, 02/20/2026 - 05:36

అలిస్సా కార్సన్‌ .. మూడేళ్ల వయస్సులో చూసిన ఒక చిన్న కార్టూన్‌ ఆమె జీవిత లక్ష్యాన్నే నిర్ణయించింది. అమెరికాలోని లూసియానాలో 2001లో జన్మించిన అలిస్సా ‘ద బ్యాక్‌ యార్డిగాన్స్‌’ అనే కార్టూన్‌ను ఇష్టంగా చూసేది. అప్పుడే తన మనసులో ఒక ఆలోచన పుట్టింది. మార్స్‌ గ్రహంపైకి వెళ్లాలని. అప్పటి నుంచి ఆమె తన లక్ష్యం కోసం కృషి చేస్తూనే ఉంది. నాసా నేరుగా పిల్లలకు శిక్షణ ఇవ్వదు, కాబట్టి ఆమె ప్రతి అవకాశాన్ని తన ఆశయసాధనకు అనుకూలంగా మలుచుకుంది. 

17 ఏళ్ల వయస్సులోనే అప్లైడ్‌ ఆస్ట్రోనాటిక్స్‌ సర్టిఫికేషన్‌ సాధించి, సబ్‌–ఆర్బిటల్‌ అంతరిక్షంలో పరిశోధనలు చేసే అర్హత పొందింది. 18ఏళ్లకే ప్రపంచంలోని అన్ని నాసా స్పేస్‌ క్యాంపులను పూర్తి చేసిన ఏకైక వ్యక్తిగా గుర్తింపు పొందింది. 2022 లో నాటో తన కార్యకలాపాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన ఐదుగురిలో అలిస్సా ఒకరు కావడం విశేషం. అలిస్సా ఇంగ్లీష్‌తో పాటు స్పానిష్, ఫ్రెంచ్, చైనీస్‌ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలదు. 

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వివిధ దేశాల వ్యోమగాములతో కలిసి పనిచేయడానికి ఇది చాలా ముఖ్యం. అలిస్సా ప్రస్తుతం ఆస్ట్రోబయాలజీలో ఉన్నత చదువులు అభ్యసిస్తూ, అరుణ గ్రహంపై మానవ మనుగడకు అవసరమైన పరిస్థితులపై పరిశోధనలు చేస్తోంది. ఆమె కేవలం తన గమ్యం వైపు పయనించడమే కాకుండా స్టెమ్‌ (సైన్స్ , టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్‌) రంగాల్లో బాలికల ప్రాతినిథ్యాన్ని పెంచడానికి కూడా కృషి చేస్తోంది. 

అలిస్సా ప్రస్తుతం అధికారికంగా నాసా వ్యోమగామి కాకపోయినప్పటికీ, ఆమె ఒక అంతరిక్ష శిక్షణలో ఉన్న వ్యక్తిగా, అంతరిక్ష ఔత్సాహికురాలిగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఇప్పుడు అదే గుర్తింపు ఆమెను 2033 లో నాసా చేపట్టబోయే మార్స్‌ యాత్రలో నిలబెట్టనుందని నిపుణులు భావిస్తున్నారు. సో యూ వాంట్‌ టు బి ఆన్‌ ఆస్ట్రోనాట్‌ అనే పుస్తకాన్ని కూడా ఆమె రాసింది. సోషల్‌ మీడియా ద్వారా తన ట్రైనింగ్‌ని మిలియన్ల మందికి చూపిస్తూ, సైన్స్ ను ఒక కూల్‌ అంశంగా మార్చేసింది. ఒక సాధారణ అమ్మాయి అసాధారణ లక్ష్యం వైపు సాగిస్తున్న ఈ ప్రయాణం, రాబోయే తరాలకు ఒక దిక్సూచి. ఎంతో మంది ఆడపిల్లలకు స్ఫూర్తి.

Videos

జగన్ ను కలిసిన అంబటి రాంబాబు

గిన్నెలో ఇరుక్కుపోయిన బుడ్డోడు తల..

ఎగిరి గంతులేసిన ఎమ్మెల్యే, ఎంపీ

పబ్లిసిటీ పీక్.. పెర్ఫామెన్స్ వీక్.. ఏపీ బడ్జెట్ పై YS జగన్ రియాక్షన్

అంబటికి విడదల రజిని పరామర్శ

బిల్లింగ్ మెషిన్‏తో బిర్యానీ స్కామ్

నేడు పరువు పోరు.. ఆస్ట్రేలియా Vs ఒమన్

అంబటికి స్వాగతం పలికిన భార్య, కూతుర్లు

హెరిటేజ్, ఇందాపూర్ కి లింక్ ఇదే.. లైవ్ లో ఆధారాలతో బయటపెట్టిన కారుమూరి

TTD డిస్ క్వాలిఫై చేసిన ఇందాపూర్ కి.. 3 నెలల్లోనే అర్హత కల్పించిన చంద్రబాబు

Photos

+5

ప్రియురాలు సోఫీయా షైన్‌తో గబ్బర్‌ శిఖర్‌ పెళ్లి.. సంగీత్ నైట్‌ ఫోటోలు

+5

హైదరాబాద్ రంజాన్‌ స్పెషల్ రుచులు..మీరూ ఓ లుక్కేయండి (ఫొటోలు)

+5

'నవాబ్‌ కేఫ్‌' హీరోయిన్ తేజు అశ్విని (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ త్రిష (ఫోటోలు)

+5

పట్టుచీరలో అందంగా సోనియా ఆకుల (ఫోటోలు)

+5

శివబాలాజీ-మధుమిత కుమారుడికి మోహన్‌బాబు ఆశీస్సులు (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు (ఫొటోలు)

+5

హీరోయిన్ నయన్ సారిక బ్యూటిఫుల్ (ఫొటోలు)

+5

స్టన్నింగ్‌ ఔట్‌ఫిట్‌తో సమంత.. వైరల్‌ ఫోటోలు

+5

విశాఖ సాగరతీరంలో సాహస గర్జన (ఫొటోలు)