Breaking News

అనన్య బిర్లాకు కథ చెప్తారా ?

Published on Fri, 02/20/2026 - 05:19

ఏవిఎం చెట్టియార్‌.. జెమిని వాసన్ .. విజయా నాగిరెడ్డి ఒకప్పుడు సినిమాలంటే మగవారి నిర్మాణం. ఇప్పుడు దేశంలో స్త్రీలు సినీ నిర్మాణాన్ని లీడ్‌ చేస్తున్నారు. బిర్లా కుటుంబం నుంచి అనన్య బిర్లా  ‘బిర్లా స్టూడియోస్‌’ మొదలెట్టడం తాజా ఉదాహరణ. భారీ మూలధనం కేటాయించి దేశీయ భాషల్లో సాంస్కృతిక మూలాలున్న సినిమాలు తీస్తానంటున్నారు అనన్య. దర్శకులూ... ఆమెకు కథ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారా?

సంప్రదాయ  మేకింగ్‌ నుంచి కార్పొరేట్‌ మేకింగ్‌కు సినీ రంగం వెళ్లేకొద్దీ స్త్రీల ప్రమేయం పెరుగుతూ ఉంది. బాలాజీ సంస్థలో ఏక్తా కపూర్, తమిళనాట రజనీకాంత్‌ కుమార్తె ఐశ్వర్య, తెలుగులో అశ్వినీదత్‌ కుమార్తెలు ప్రియాంక, స్వప్న, అన్నపూర్ణ నుంచి సుప్రియా యార్లగడ్డ, చిరంజీవి కుమార్తె సుస్మిత... ఇలా ఇన్ని పేర్లు ఒకప్పుడూ ఊహకే అసాధ్యం. ఇప్పుడు ఈ మహిళా శక్తికి మరో ప్రచండ శక్తి తోడయ్యింది. బిర్లా గ్రూప్‌ నుంచి అనన్య బిర్లా తాజాగా సినిమా రంగంలోకి వచ్చారు. ‘బిర్లా స్టూడియోస్‌’ స్థాపించి ప్రాదేశిక చిత్రాలను తీయాలని నిశ్చయించుకున్నారు. ఇది దర్శకులకు మంచి కబురే.

ఎలా మేలు?
సంప్రదాయ ప్రొడ్యూసర్లు ఏకకాలంలో అనేక సినిమాలు తీయరు. కాని కార్పొరేట్‌ సంస్థలకు ఆ సౌలభ్యం, సామర్థ్యాలు, వ్యవస్థ ఉంటాయి. సంప్రదాయ ప్రొడ్యూసర్లు ఫార్ములాకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వొచ్చు. అనన్య బిర్లా చెప్పేదాని ప్రకారం మూసకు భిన్నంగా ఉండే కథలకు అవకాశం దొరుకుతుంది. పక్షపాతాలు, సిఫార్సులతో పని లేకుండా టాలెంట్‌కు అవకాశం దొరికే వీలు ఎక్కువ.

కుబేరుల్లో కళాహృదయం
ఆదిత్య బిర్లా గ్రూప్‌ దేశంలో అతిపెద్ద వ్యాపార సంస్థల్లో ఒకటి. అటువంటి సంస్థకు వారసురాలు అనన్య బిర్లా. కుమార మంగళం బిర్లా, నీర్జా బిర్లా దంపతుల పెద్ద కుమార్తె. బిర్లా కుటుంబంలో ఆరవ తరం వారసురాలు. అయితే అది మాత్రమే ఆమె ప్రత్యేకత కాదు. అనన్యది కళాహృదయం. ఆమె ప్రముఖ గాయని. పదకొండేళ్ల వయసులోనే సంతూర్‌ వాయించడం నేర్చుకున్నారు. ఆ తర్వాత అనేక ఆల్బమ్స్‌ విడుదల చేసి అభిమానులను పొందారు.

 మరోవైపు అమెరికన్‌ స్కూల్‌ ఆఫ్‌  బాంబేలో చదువు పూర్తి చేసి ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ పొందారు. 17 ఏళ్ల వయసులోనే సొంతంగా మైక్రోఫిన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను స్థాపించారు. ప్రస్తుతం ఇది దేశంలో రెండవ అతిపెద్ద మైక్రోఫైనాన్స్ సంస్థ. 2016లో అనన్య లగ్జరీ ఇ–కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ అయిన ‘ఇకాయ్‌ అసాయ్‌’ను స్థాపించారు. ఫోర్బ్స్‌ విడుదల చేసిన ‘ఆసియాలో ప్రముఖ మహిళలలో ఒకరిగా’ నిలిచారు. గతేడాది ఆమె ‘బిర్లా కాస్మెటిక్స్‌’ పేరుతో కన్సూ్యమర్‌ బ్రాండ్లు ప్రారంభించారు.

దేశీయ కథలకే ప్రాధాన్యం
‘బిర్లా స్టూడియో’ పేరుతో కొత్త ఫిల్మ్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ ప్రారంభించాక వాణిజ్యపరంగా లాభదాయకమైన సినిమా లు తీస్తూనే కథనంలో విలువల పరంగా ఏమాత్రం రాజీపడనని అనన్య తెలిపారు. ‘మనమందరం కథలు వింటూనే పెరిగాం. కథలు వినేందుకు మన చుట్టూ ఉన్న శక్తిమంతమైన మాధ్యమాలలో సినిమా ఒకటి. దాన్ని సమర్థంగా వినియోగించుకుంటే ప్రేక్షకులకు అద్భుతాలు చూపించొచ్చు’ అని ఆమె వివరిస్తున్నారు. ‘వినోద విలువలతో సాంస్కృతిక ప్రాముఖ్యతను చూపే చిత్రాలు తీయడంపైనే మా నిర్మాణ సంస్థ నుంచి దృష్టి పెడుతుంది’ అంటున్నారు. త్వరలో బిర్లా స్టూడియోస్‌ హిందీ, గుజరాతీ, మలయాళంతోపాటు ఇతర అన్ని ప్రాంతీయ భాషల్లో చిత్రాలు తీయాలని చూ స్తోంది. ఇంగ్లిషు సినిమాలు సైతం తీసే యోచనతో ఉంది.

పెద్ద దర్శకులతో చర్చలు
బి స్టూడియోస్‌ అనౌన్స్‌మెంట్‌ వచ్చిన వెంటనే చాలా మంది పెద్ద దర్శకులతో అనన్య బిర్లా చర్చలు జరుపుతున్నారని వార్తలు వస్తున్నాయి. అనీజ్‌ బాజ్మీ, సూజిత్‌ సర్కార్, నీరజ్‌ పాండే తదితరులు ఉన్నారని సమాచారం.

Videos

జగన్ ను కలిసిన అంబటి రాంబాబు

గిన్నెలో ఇరుక్కుపోయిన బుడ్డోడు తల..

ఎగిరి గంతులేసిన ఎమ్మెల్యే, ఎంపీ

పబ్లిసిటీ పీక్.. పెర్ఫామెన్స్ వీక్.. ఏపీ బడ్జెట్ పై YS జగన్ రియాక్షన్

అంబటికి విడదల రజిని పరామర్శ

బిల్లింగ్ మెషిన్‏తో బిర్యానీ స్కామ్

నేడు పరువు పోరు.. ఆస్ట్రేలియా Vs ఒమన్

అంబటికి స్వాగతం పలికిన భార్య, కూతుర్లు

హెరిటేజ్, ఇందాపూర్ కి లింక్ ఇదే.. లైవ్ లో ఆధారాలతో బయటపెట్టిన కారుమూరి

TTD డిస్ క్వాలిఫై చేసిన ఇందాపూర్ కి.. 3 నెలల్లోనే అర్హత కల్పించిన చంద్రబాబు

Photos

+5

ప్రియురాలు సోఫీయా షైన్‌తో గబ్బర్‌ శిఖర్‌ పెళ్లి.. సంగీత్ నైట్‌ ఫోటోలు

+5

హైదరాబాద్ రంజాన్‌ స్పెషల్ రుచులు..మీరూ ఓ లుక్కేయండి (ఫొటోలు)

+5

'నవాబ్‌ కేఫ్‌' హీరోయిన్ తేజు అశ్విని (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ త్రిష (ఫోటోలు)

+5

పట్టుచీరలో అందంగా సోనియా ఆకుల (ఫోటోలు)

+5

శివబాలాజీ-మధుమిత కుమారుడికి మోహన్‌బాబు ఆశీస్సులు (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు (ఫొటోలు)

+5

హీరోయిన్ నయన్ సారిక బ్యూటిఫుల్ (ఫొటోలు)

+5

స్టన్నింగ్‌ ఔట్‌ఫిట్‌తో సమంత.. వైరల్‌ ఫోటోలు

+5

విశాఖ సాగరతీరంలో సాహస గర్జన (ఫొటోలు)