రామ్ చరణ్ పెద్ది సినిమాపై క్రేజీ అప్ డేట్..
Breaking News
200 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
Published on Fri, 11/14/2025 - 09:24
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:21 సమయానికి నిఫ్టీ(Nifty) 68 పాయింట్లు తగ్గి 25,812కు చేరింది. సెన్సెక్స్(Sensex) 247 పాయింట్లు నష్టపోయి 84,228 వద్ద ట్రేడవుతోంది. బిహార్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.18
బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 63.9 డాలర్లు
యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.12 శాతానికి చేరాయి.
గడిచిన సెషన్‌లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.66 శాతం తగ్గిపోయింది.
నాస్‌డాక్ 2.29 శాతం నష్టపోయింది.
Today Nifty position 14-11-2025(time- 9:23 am)

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Tags : 1