మోదీ మాస్టర్ ప్లాన్.. బీహార్ సీఎం నితీష్ కాదు ?
Breaking News
నష్టాల్లో టాటా మోటార్స్ సీవీ
Published on Fri, 11/14/2025 - 08:41
వాణిజ్య వాహన రంగ దిగ్గజం టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ (టీఎంసీవీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెప్టెంబర్(క్యూ2)లో లాభాలనువీడి రూ. 867 కోట్ల నికర నష్టం ప్రకటించింది. టాటా క్యాపిటల్‌లో పెట్టుబడుల ఫలితంగా నమోదైన రూ. 2,026 కోట్ల మార్క్ టు మార్కెట్ (ఎంటుఎం) నష్టాలు లాభాలను దెబ్బతీశాయి.
గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 498 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 17,535 కోట్ల నుంచి రూ. 18,585 కోట్లకు బలపడింది. నిర్వహణ లాభం(ఇబిటా) రూ. 1,225 కోట్ల నుంచి రూ. 1,694 కోట్లకు ఎగసింది. జూలైలో ప్రతిపాదించిన ఐవెకో కొనుగోలు ప్రక్రియ ప్రణాళిక ప్రకారం ముందుకెళుతున్నట్లు టాటా గ్రూప్ ఆటో దిగ్గజం పేర్కొంది. వచ్చే(2026) ఏప్రిల్‌కల్లా కొనుగోలు పూర్తికాగలదని భావిస్తోంది. ఐవెకోను సొంతం చేసుకున్నాక ఆదాయం 24–25 బిలియన్ డాలర్లకు చేరగలదని అంచనా వేస్తోంది. కంపెనీ ఇటీవల ప్రయాణికుల వాహన విభాగాన్ని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్(టీఎంపీవీ)గా విడదీయడంతోపాటు.. వాణిజ్య వాహన విభాగాన్ని టాటా మోటార్స్ లిమిటెడ్ (టీఎంసీవీ) పేరుతో లిస్ట్ చేసింది.
ఇదీ చదవండి: బాలల సంక్షేమం కోసం ప్రభుత్వ పథకాలు
Tags : 1