Madanapalle: యమునకు ఒక కిడ్నీ తొలగించినట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడి
నిర్మాతగా 'పా రంజిత్'.. ఓటీటీలో హిట్ సినిమా
Published on Fri, 11/14/2025 - 08:40
కోలీవుడ్‌లో భారీ విజయం అందుకున్న థ్రిల్లర్ సినిమా దండకారణ్యం (Thandakaranyam).. సుమారు రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది. కోలీవుడ్‌లో భారీ విజయం అందుకున్న ఈ చిత్రం ఐఎండీబీలో 7.1 రేటింగ్‌తో ఉంది. ఈ సినిమా గురించి తమిళ రివ్యూవర్లు కూడా గొప్పగానే చెప్పుకొచ్చారు. దర్శకుడు అతియన్ అతిరై తెరకెక్కించిన ఈ థ్రిల్లర్ మూవీని ప్రముఖ దర్శకుడు పా రంజిత్ నిర్మించడం విశేషం.ఇందులో వి ఆర్ దినేష్, కలైయరసన్ ప్రధాన పాత్రల్లో నటించగా, రిత్విక, విన్సు సామ్, షబీర్ కల్లారక్కల్, బాల శరవణన్ సహాయక పాత్రల్లో మెప్పించారు.
సెప్టెంబర్ 19న దండకారణ్యం చిత్రం థియేటర్లలో విడుదలైంది. అటవీప్రాంతానికి చెందిన బిడ్డ ఎలాగైనా సరే ఇండియన్ ఆర్మీలో చేరాలనే తన కలను నేరవేర్చుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడో ఈ చిత్రంలో చూపించారు. నవంబర్ 14 నుంచి సన్ నెక్స్ట్(Sun NXT) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదే విషయాన్ని తెలుపుతూ ఆ ఓటీటీ సంస్థ ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. అయితే, ఈ మూవీ కేవలం తమిళ్ వర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది.

ఓ ఆదివాసీ యువకుడిపై అణచివేత అడగడుగునా పడుతున్నా సరే ఇండియన్ ఆర్మీలో చేరాలన్న తన ప్రయాణాన్ని ఎలా కొనసాగించాడనేది ఈ మూవీలో అద్భుతంగా చూపించారు. తమ గ్రామ ప్రజల కోసం ఓ ఆదివాసీ యువకుడు చేసిన పోరాటం ఎలా ఉంటుందో దండకారణ్యంలో చూపించారు.
Tags : 1