వేదికపైనే కుప్ప కూలిన రోబో (వీడియో)

Published on Thu, 11/13/2025 - 17:10

టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో.. చాలా దేశాల్లో ఇప్పటికే హ్యుమానాయిడ్ రోబోలు అందుబాటులో ఉన్నాయి. అయితే రష్యా ఇటీవల తన మొట్టమొదటి కృత్రిమ మేధస్సుతో నడిచే హ్యూమనాయిడ్ రోబోను ఆవిష్కరించింది. కానీ ప్రారంభంలోనే విఘాతం అన్నట్టు.. రోబో కిందపడింది.

రష్యా తయారు చేసిన రోబోట్ పేరు 'ఐడల్' (Aidol). దీనిని నవంబర్ 10న మాస్కోలోని యారోవిట్ హాల్ కాంగ్రెస్ సెంటర్‌లో జరిగిన టెక్నాలజీ షోకేస్ సందర్భంగా ఆవిష్కరించారు. ప్రారంభంలో మెల్లగా అడుగులు వేసుకుంటూ వేదికపైకి వచ్చిన రోబోట్.. అక్కడున్నవారికి అభివాదం చేస్తున్నట్లు చెయ్యి పైకెత్తింది. ఆ తరువాత ఓ రెండడుగులు ముందుకు వేసి కిందకు పడిపోయింది. దీంతో అక్కడే ఉన్న సిబ్బంది దానిని పైకిలేపి కష్టం మీద తీసుకెళ్లారు. కానీ అనుకున్నదొకటి, అయినది ఒకటిగా జగడంతో.. కార్యక్రమం మధ్యలోనే నిలిచిపోయింది.

ఐడల్ రోబోట్ కిందికి పడగానే.. దానికి ఫిక్స్ చేసిన కొన్ని భాగాలు కూడా ఊడిపోయాయి. రష్యన్ రోబోటిక్స్ సంస్థ రూపొందించిన ఈ ఐడల్ ప్రస్తుతం ఇంకా టెస్టింగ్ దశలోనే ఉంది. ప్రజల సందర్శనార్థం దీనిని ప్రదర్శించాలనుకున్నప్పుడు ఈ సంఘటన జరిగిందని కంపెనీ సీఈఓ పేర్కొన్నారు. కాగా ఇంజనీర్లు ఐడల్.. బ్యాలెన్స్ సిస్టమ్‌, కంట్రోల్ సాఫ్ట్‌వేర్‌ వంటి వాటిని ఇంకా పరిశీలించాల్సి ఉందని ఆయన అన్నారు.

హ్యుమానాయిడ్ రోబోలు
ప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాలు హ్యుమానాయిడ్ రోబోలను రూపొందించే దిశలో వేగంగా అడుగులు వేస్తున్నాయి. ఈ రంగంలో చైనా అగ్రస్థానంలో ఉండగా.. జపాన్, సౌత్ కొరియా, అమెరికా, జర్మనీ దేశాలు సైతం తమదైన రీతిలో పరిశోధనలు చేస్తున్నాయి, రోబోలను ఆవిష్కరిస్తున్నాయి.

మన దేశం కూడా హ్యుమానాయిడ్ రోబోలను రూపొందించడంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే ISRO తయారు చేసిన వ్యోమిత్రా (Vyommitra) హ్యూమనాయిడ్ రోబోట్, మానవ అనే 3D ప్రింటెడ్ హ్యూమనాయిడ్ రోబోట్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో రూపొందించిన మల్టీపర్పస్ హ్యూమనాయిడ్ రోబోట్ అల్ఫా1.0 వంటివి ఉన్నాయి.

Videos

బీహార్ కా షేర్

పెళ్లి వేడుకలో వైఎస్ జగన్

మోదీ మాస్టర్ ప్లాన్.. బీహార్ సీఎం నితీష్ కాదు ?

ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా! గాంధీభవన్ వద్ద కాంగ్రెస్ సంబరాలు

బిహార్ లో ఎన్డీయే హవా.. గెలుపుకి కారణం ఇదే!

బీహార్ ఎగ్జిట్ పోల్స్ లో ఒకలా.. ఫైనల్స్ లో ఫలితాలు మరోలా

5500 ఓట్ల మెజారిటీతో దూసుకుపోతున్న నవీన్ యాదవ్

అప్పుల్లో బాబు తర్వాత నేనే! జనసేన MLA అరాచకాలు

క్రీడా కీర్తి కిరీటం

విజయం వైపు దూసుకుపోతున్న ఎన్డీయే కూటమి

Photos

+5

‘దేవగుడి’ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశీస్సులు (ఫొటోలు)

+5

జూబ్లీహిల్స్‌లో కొనసాగుతున్న కౌంటింగ్‌.. అభ్యర్థులు, ఏజెంట్లు బిజీ (ఫొటోలు)

+5

ఫ్రెషర్స్‌ డే పార్టీ.. అదరగొట్టిన అమ్మాయిలు (ఫొటోలు)

+5

బీచ్ ఒడ్డున సంయుక్త.. ఇంత అందమా? (ఫొటోలు)

+5

భర్త బర్త్ డే.. సుమ క్యూట్ పోస్ట్ (ఫొటోలు)

+5

SSMB29 లోకేషన్‌కి ట్రిప్ వేసిన అనసూయ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ అంజలి (ఫొటోలు)

+5

లేటు వయసులో ట్రెండింగ్ అయిపోయిన గిరిజ (ఫొటోలు)

+5

‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ సక్సెస్‌ మీట్‌.. ముఖ్య అతిథిగా విజయ్‌ (ఫొటోలు)