Adilabad: పిడిగుద్దులతో రెచ్చిపోయిన కాంగ్రెస్, బీఆర్ఎస్
Breaking News
కాంతార చాప్టర్-1.. రిషబ్ శెట్టి గూస్‌బంప్స్ వీడియో చూశారా?
Published on Wed, 11/12/2025 - 19:02
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన లేటేస్ట్ మూవీ కాంతార చాప్టర్-1. దసరా కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఏకంగా రూ.800 కోట్లకు పైగా వసూళ్లతో విక్కీ కౌశల్ ఛావాను దాటేసింది. దీంతో 2025లో అత్యధి వసూళ్లు సాధించిన మూవీగా ఘనతను సొంతం చేసుకుంది. కాంతారకు ప్రీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
తాజాగా ఈ మూవీ నుంచి అద్భుతమైన వీడియోను పోస్ట్ చేసింది ఓటీటీ సంస్థ. ఈ మూవీలో రిషబ్ శెట్టి గులిగా మారే సీన్‌కు సంబంధించిన వీడియోను పంచుకుంది. రిషబ్ శెట్టి ఐకానిక్ ట్రాన్స్ఫర్మేషన్ అంటూ వీడియో పోస్ట్ చేసింది. ఈ సీన్ ఆడియన్స్‌కు గూస్ బంప్స్ తెప్పించేలా మాత్రమే కాదు.. ఒళ్లు గగుర్పొడ్చేలా ఉంటుంది. ఈ సీన్‌లో గుల్షన్ దేవయ్య నటన కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. కాగా.. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, జయరామ్ కీలక పాత్రలు పోషించారు.
Tags : 1