Adilabad: పిడిగుద్దులతో రెచ్చిపోయిన కాంగ్రెస్, బీఆర్ఎస్
Breaking News
PR కోసం రూ.16 లక్షలు.. తెలుగులోనూ ఇదే జరుగుతోందా?
Published on Wed, 11/12/2025 - 10:46
బిగ్‌బాస్ షో (Bigg Boss Reality Show)లో అడుగుపెట్టే కంటెస్టెంట్లు ముందుగానే పీఆర్ (పబ్లిక్ రిలేషన్ టీమ్)ను సెట్ చేసుకుని వస్తారు. అందుకోసం వేలల్లో కాదు, ఏకంగా లక్షల్లో ఖర్చు పెడతారు. అంత స్థోమత లేని వారు హౌస్‌లో ఉన్నన్నాళ్లుండి ఏదో ఒక వారం బయటకు వచ్చేస్తుంటారు. ఇటీవలే మలయాళ బిగ్‌బాస్ ఏడో సీజన్ విజయవంతంగా పూర్తయింది. ఈ సీజన్‌లో నటి అనుమోల్ విజేతగా నిలిచింది. ట్రోఫీతోపాటు రూ.42.5 లక్షలు, ఒక ఎస్‌యూవీ కారును గెల్చుకుంది.
పీఆర్ కోసం రూ.16 లక్షలు
కామన్ మ్యాన్ అనీష్ రన్నరప్‌గా నిలిచాడు. ఇక ఇదే సీజన్‌లో పాల్గొన్న బిన్నీ సెబాస్టియన్ అనే కంటెస్టెంట్.. అనుమోల్ (Anumol) పెద్ద పీఆర్‌ను పెట్టుకుందని, అందుకోసం ఏకంగా రూ.16 లక్షలు ఖర్చు చేసిందని బిగ్‌బాస్ హౌస్‌లోనే కామెంట్ చేశాడు. దీంతో ఆమె పీఆర్ వల్లే గెలిచిందంటూ విమర్శలు మొదలయ్యాయి. దీనిపై అనుమోల్ స్పందించింది. నేను రూ.16 లక్షలు పెట్టి పీఆర్‌ను సెట్ చేసుకోవడం వల్లే టైటిల్ గెలిచానంటున్నారు. అది ఏమాత్రం నిజం కాదు.
అంత డబ్బు నాకెక్కడిది?
అంత డబ్బు నా దగ్గర లేదు. అయితే ప్రతి కంటెస్టెంట్ పీఆర్‌ను పెట్టుకుంటారని నాతో చెప్పారు. అందుకే నేను కూడా ఓ వ్యక్తిని కలిశాను. అతడు రూ.15 లక్షలు అడిగాడు. అంత స్థోమత నాకు లేదని చెప్పాను. కేవలం రూ.1 లక్ష మాత్రమే ఇస్తానన్నాను. రూ.50 వేలు అడ్వాన్స్‌గా ఇచ్చాను. షో అయిపోయాక మిగతా సగం ఇస్తానన్నాను. ఈ రూ.16 లక్షల స్టోరీ ఎవరు అల్లారో నాకు అర్థం కావడం లేదు. అంత డబ్బు ఖర్చు పెట్టే స్థోమత ఉంటే ఈ షోకి వచ్చేదాన్ని కాదు అని క్లారిటీ ఇచ్చింది.
ఇక్కడా అదే రిపీట్?
మలయాళ బిగ్‌బాస్ 7లో సెలబ్రిటీ విన్నర్ అయితే కామనర్ రన్నరప్ అయ్యాడు. దీంతో తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్‌లోనూ ఇదే జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. తనూజకు కప్పిచ్చేస్తారని, కల్యాణ్ రన్నరప్‌గా ఉంటాడని దాదాపు అందరూ ఫిక్సయ్యారు. పైగా పీఆర్ కోసం వాళ్లే అంత ఖర్చుపెడ్తే తెలుగు కంటెస్టెంట్లు ఇంకే రేంజులో ఖర్చు పెడుతున్నారో? అని గుసగుసలాడుతున్నారు. మరి ఫైనల్‌లో ఇదే జరుగుతుందా? లేదంటే కామనర్ విన్నింగ్ రేసులోకి వస్తాడా? చూడాలి!
చదవండి: రీతూ మళ్లీ తొండాట? నోటికొచ్చినట్లు వాగితే కుదరదంటూ వార్నింగ్
Tags : 1